రీఛార్జ్ చేసుకుంటే ఓటీటీ ఫ్రీ - వీఐ సూపర్ ఆఫర్..!

రీఛార్జ్ చేసుకుంటే ఓటీటీ ఫ్రీ - వీఐ సూపర్ ఆఫర్..!

ఓటీటీ వినియోగం వినియోగం రోజురోజుకీ పెరిగిపోతోంది. ఒకప్పుడు కేబుల్ టీవీ లేకపోతే టీవీ ఉండి దండగ అనేవారు. ఇప్పుడు స్మార్ట్ టీవీలు వచ్చాక ఓటీటీ ప్లాన్ లేకపోతే ఇంట్లో టీవీ లేనట్లే అని ఫీల్ అవుతున్నారు చాలామంది. జనాల్లో ఉన్న ఈ వీక్నెస్ ని ఇప్పటికే జియో, ఎయిర్టెల్ వంటి సంస్థలు ఇప్పటికే క్యాష్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఇదే బాటలో వీఐ సంస్థ కూడా ముందుకొచ్చింది. రూ. 169 ప్లాన్ తో డిస్ని ప్లస్ హాట్ స్టార్ట్ 90 రోజుల సబ్స్క్రిప్షన్ ని ఫ్రీగా ఇస్తోంది.

రూ. 169 ప్లాన్ తో వచ్చే బెనిఫిట్స్ ఇవే:

8 జీబీ డేటా:

ఈ ప్లాన్ తో 30రోజులకు గాను 8జీబీ డేటా అందిస్తోంది వీఐ. ప్రస్తుతం ఇతర సంస్థలు అందిస్తున్న 28రోజుల ప్లాన్ కంటే ఇది బెస్ట్ ఆఫర్ అని చెప్పచ్చు.

ఎంటర్టైన్మెంట్ బెనిఫిట్స్:

ఈ రీఛార్జ్ తో 30రోజుల డేటా వ్యాలిడిటీ మాత్రమే కాకుండా 90రోజుల పాటు డిస్ని ప్లస్ హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ కూడా ఫ్రీ అందిస్తోంది వీఐ.

ఇతర బెనిఫిట్స్: 

రూ. 169 రీఛార్జ్ తో 90 రోజుల పాటు హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ తో పాటుగా 30 రోజుల డేటా వ్యాలిడిటీ వస్తుంది. అయితే, ఈ ప్యాక్ తో టైమ్ వ్యాలిడిటీ కానీ, ఫ్రీ ఎస్సెమ్మెస్ ఆఫర్ కానీ వర్తించదు.

టాక్ టైమ్ వ్యాలిడిటీ, ఫ్రీ ఎస్సెమ్మెస్ ఆఫర్ కావాలంటే యూజర్స్ ప్రత్యేకంగా రూ. 155తో రీఛార్జ్ చేసుకుంటే 24 రోజుల పాటు టాక్ టైమ్ వ్యాలిడిటీ, ఫ్రీ ఎస్సెమ్మెస్ ఆఫర్ వస్తుంది.