- రూ.1.26 లక్షలు.. రూ. 2,460 పెరిగిన వెండి రేటు
న్యూఢిల్లీ: డిమాండ్ బాగుండటం, డాలర్ బలహీనపడటంతో ఢిల్లీలో బంగారం ధరలు పెరిగాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ. 1,300 పెరిగి రూ. 1,25,900కి చేరుకుంది. అయితే, 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం రూ.1,24,000 నుంచి రూ. 1,25,300కి పెరిగింది. స్థానిక బులియన్ మార్కెట్లో, 99.9 శాతం స్వచ్ఛత ఉన్న బంగారం గత సెషన్లో 10 గ్రాములకు రూ. 1,24,600 వద్ద ముగిసింది. డిమాండ్ కొనసాగడం, యూఎస్ స్థూల- ఆర్థిక డేటా బలహీనంగా ఉండటంతో ధరలు పెరిగాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ ఎనలిస్ట్ సౌమిల్ గాంధీ చెప్పారు. ఇదిలా ఉంటే, వెండి ధర రూ. 2,460 పెరిగి రూ. 1,55,760కి చేరుకుంది. గత శుక్రవారం వెండి ధర రూ. 1,53,300 వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్లో, స్పాట్ బంగారం ఔన్స్ ధర 2.08 శాతం పెరిగి 4,082.84 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. స్పాట్ వెండి ధర 3.30 శాతం పెరిగి ఔన్స్ 49.93 డాలర్లకు చేరింది.
