
దేశంలో పసడి ధరలు పరుగులు పెడుతున్నాయి. రోజు రోజుకు బంగారం ధరలు మరింత ప్రియం అవుతున్నాయి. పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనలేని పరిస్థితి ఎదురవుతోంది. అమెరికాలో ఫెడ్ వడ్డీ రేట్లు పెరగడంతో గోల్డ్ రేట్లు క్షీణిస్తాయని భావించినా..రెండు రోజుల పాటు తగ్గిన బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి.
హైదరాబాద్ లో బంగారం ధరలు..
బుధవారం బంగారం ధరలు ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్నాయి. ఇంట్రాడే ట్రేడ్‌లో 10 గ్రాముల బంగారం ధర ₹57,259 గరిష్ట స్థాయికి చేరింది. తాజాగా పెరిగిన ధరలతో హైదరాబాద్ లో బంగారం ధర 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారానికి 52,750 గా కొనసాగుతుంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 57,550 వద్ద ట్రేడ్ అవుతోంది. ఏపీలోని విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,750 వద్ద ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 57,550 పలుకుతోంది.
ఢిల్లీ, ముంబై, బెంగళూరులలో బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 52,900 వద్ద ట్రేడ్ అవుతుండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 57,700గా పలుకుతోంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,750 ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 57,550గా ఉంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 52,800గా కొనసాగుతుండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 57,600 వద్ద ట్రేడ్ అవుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 53,830 రూపాయలుగా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 58,720 వద్ద ట్రేడ్ అవుతుంది.
వెండి ధరలు కూడా..
బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. ఢిల్లీలో కిలో వెండి ధర 71 వేల 300 రూపాయలు వద్ద ట్రేడ్ అవుతుండగా.., హైదరాబాదులో కిలో వెండి ధర 74 వేల రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.