బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయ్..

బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయ్..

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. గత మూడు రోజులు నిలకడ ఉన్న బంగారం ధరలు ఇవాళ( నవంబర్ 15) ఒక్కసారిగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడల్లో నిన్నటి ధరలతో పోల్చుకుంటే 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ. 55వేల 550 ఉండగా400 పెరిగి..55వేల 950కి చేరింది. నిన్న (నవంబర్ 14) 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర 60వేల 600 ఉండగా..440 రూపాయలు పెరిగి 61వేల 40లకు చేరుకుంది.

మరో వైపు వెండి ధర కూడా భారీగా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర 1700 రూపాయలు పెరిగి రూ. 777వేల 700లకు చేరింది.ఇటీవల కాలంలో ఇంతగా రేటు పెరగడం ఇదే మొదటి సారి.