భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?

భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?

పసిడి ధరలు వినియోగదారులకు షాకిస్తున్నాయి. గత 10 రోజుల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 2024, మార్చిలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బంగారం ధరలు రెక్కలొచ్చాయి. తాజాగా దేశంలో మరోసారి బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 500 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 540 రూపాయలు పెరిగాయి.  దీంతో తులం బంగారం ధర రూ.60 వేలు దాటింది. ఈ క్రమంలో సమాన్య జనాలు బంగారం వైపు చూడాలంటనే భయపడిపోతున్నారు.2024, మార్చి 10వ తేదీ శనివారం తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,750గా ఉంది. ఇక,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,270కి చేరుకుంది. కిలో వెండి ధర రూ.79,100గా ఉంది. ఆంధ్రప్రదేశ్ విజయవాడలోనూ బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. 

దేశవ్యాప్తంగా బంగారం ధరలు:

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,900గా ఉంది. ఇక,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,420కి చేరుకుంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,750గా ఉంది. ఇక,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,270కి చేరుకుంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,750గా ఉంది. ఇక,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,270కి చేరుకుంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,500గా ఉంది. ఇక,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,100కి చేరుకుంది.