లక్షా 8 వేలకు పైగా ఉన్న తులం బంగారం ధర.. ఎంత తగ్గిందంటే..

లక్షా 8 వేలకు పైగా ఉన్న తులం బంగారం ధర.. ఎంత తగ్గిందంటే..

బంగారం ధరలు ఆల్ టైమ్ హైలో కూర్చున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఇండియాలో సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుకుంది గోల్డ్. యూఎస్ టారిఫ్ టెన్షన్లతో డాలర్ పైన ఆధారపడకుండా ఉండేందుకు ఇండియా లాంటి దేశాలు బంగారంపై పెట్టుబడులు పెడుతున్నాయి. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా వరకు గోల్డ్ రిజర్వులను పెంచుకుంది. 

మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్ని ట్రేడ్ అనిశ్చిత్తి కారణంగా స్టాక్ మార్కెట్ నుంచి కూడా పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నారు. దీంతో సేఫ్ బెట్ గా బంగారాన్ని కొనుగోలు చేస్తూ వస్తున్నారు ఇన్వెస్టర్లు. దీంతో ఇండియాలో గత కొద్దిరోజులుగా వరుసగా పెరుగుతూ ఆల్ టైమ్ హై కి చేరుకుంది బంగారం. 

హైదరాబాద్, విజయవాడలో ధరలు ఇలా ఉన్నాయి:

24 క్యారెట్ల బంగారం ధరలు:

సోమవారం (సెప్టెంబర్ 08) బంగారం ధరలు దాదాపు గత మార్కెట్ రేట్ల వద్దనే ఉన్నాయి. 
 గ్రాముకు 11 రూపాయల చొప్పున తగ్గి  రూ.10 వేల 838 దగ్గర ఉంది. . 
 బంగారంపై స్వల్పంగా రూ.111 రూపాయలు తగ్గి లక్షా 8 వేల 38 (రూ.1,08,380) దగ్గరికి చేరుకుంది. 

ALSO READ : జొమాటో, స్విగ్గీలో పెరగనున్న ఫుడ్ డెలివరీ ఖర్చులు

22 క్యారెట్ల బంగారం ధరలు: 

హైదరాబాద్ లో గ్రాముకు 10 రూపాయలు తగ్గి ఒక గ్రాము ధర రూ. 9,935 దగ్గర ఉంది.
ఇక తులం బంగారం ధర 99,350 వద్ద ఉంది. తులం బంగారంపై స్వల్పంగా 100 రూపాయలు తగ్గింది.