రూ. 60 వేల దిగువకు పడిన బంగారం ధరలు

రూ. 60 వేల దిగువకు పడిన బంగారం ధరలు

పసిడి ప్రియులకు ఇది ఖచ్చితంగా శుభవార్తేనని చెప్పాలి.  ఇటీవల వరుసగా పెరుగుతూ జీవన కాల గరిష్ఠ స్థాయిని తాకి బంగారం ధరలు క్రమంగా మళ్లీ దిగివస్తున్నాయి.   2023 డిసెంబర్  12 న హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం.

మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం  ధర  10 గ్రాములకు రూ. 200 తగ్గి ప్రస్తుతం రూ. 56 వేల 950 వద్దకు పడిపోయింది. ఇక 24 క్యారెట్ల  బంగారం  ధర తులానికి రూ. 220 మేర తగ్గి ప్రస్తుతం రూ. 62 వేల 130 వద్ద ఉంది.   విజయవాడలో 22 క్యారెట్ల బంగారం  ధర  10 గ్రాములకు రూ. 200 తగ్గి ప్రస్తుతం రూ. 56 వేల 950 వద్దకు పడిపోయింది. ఇక 24 క్యారెట్ల  బంగారం  ధర తులానికి రూ. 220 మేర తగ్గి ప్రస్తుతం రూ. 62 వేల 130 వద్ద ఉంది.   

హైదరాబాద్ లోనే  కాకుండా దేశంలోని ఇతర నగరాల్లో కూడా బంగారం ధరలు డిసెంబర్ 4న ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అయితే, డిసెంబర్ 4 నుండి 3.5 శాతానికి పైగా ధరలు పడిపోయాయి.  డిసెంబర్ నెలలో బంగారం ధరలు ఈరోజు తొలిసారిగా  రూ.62 వేల మార్క్ దిగువకు పడిపోయాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టడానికి అమెరికా డాలర్‌ కారణంగా చెప్పవచ్చు.

అటు వెండి ధరలు కూడా వరుసగా రెండో రోజు పడిపోయింది. కిలో వెండి రూ. 200 తగ్గి రూ. 77 వేల 800 లకు దిగివచ్చింది. ఇక ఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో వెండి రేటు ఇవాళ రూ. 200 తగ్గి ప్రస్తుతం రూ. 75 వేల 800 మార్క్ వద్దకు చేరింది.