తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధ‌ర‌లు.. ఆషాఢం ఆఫ‌ర్స్ ఉన్నాయా?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధ‌ర‌లు.. ఆషాఢం ఆఫ‌ర్స్ ఉన్నాయా?

బంగారం ధరలు తగ్గుతున్నాయి. కొన్ని రోజులుగా అత్యధికంగా ధరలు.. ఇప్పుడిప్పుడే దిగి వస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ అయిపోవటం, శుభకార్యాలు లేకపోవటంతో బంగారం షాపులు వెలవెలబోతున్నాయి. చిన్న చిన్న ఆభరణాలు తప్పితే.. భారీ ఎత్తున కొనుగోళ్లు లేకపోవటంతో.. వారం రోజులుగా బంగారం ధరలు తగ్గుతూనే ఉన్నాయి. 

హైదరాబాద్ మార్కెట్ లో 2023, జులై 12వ తేదీన 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 59 వేల 410 రూపాయలుగా ఉంది. అదే 22 క్యారెట్ల గోల్డ్.. 10 గ్రాముల ధర 54 వేల 450 రూపాయలుగా ఉంది. 

ఇక విజయవాడ మార్కెట్ చూస్తే.. 24 క్యారెట్ల గోల్డ్.. 10 గ్రాముల ధర 59 వేల 410 రూపాయలుగా ఉంటే.. 22 క్యారెట్స్.. ఆభరణాల ధర 10 గ్రాములు 54 వేల 450 రూపాయలుగా ఉంది. 

ఇక వెండి ధరలను పరిశీలిస్తే హైదరాబాద్ లో కిలో వెండి 77 వేల రూపాయలుగా ఉంది. విజయవాడలోనూ ఇదే ధర కంటిన్యూ అవుతుంది. బంగారంతో పోల్చితే.. వెండి ధరలు బాగా పెరుగుతున్నాయి. 

ఆషాఢం సీజన్ లో బంగారం, వెండి కొనుగోళ్లపై ఆఫర్స్ ప్రకటించే వ్యాపారులు.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తరుగులో ఒక శాతం, అర శాతం డిస్కొంట్ అంటూ చేతులు దులుపుకుంటున్నారు. మార్కెట్ రేటు ఆధారంగా అమ్మకాలు సాగిస్తున్నారు. స్పెషల్ ఆఫర్స్ అంటూ ఏమీ లేకపోవటం విశేషం. మేకింగ్ ఛార్జీల్లో వెయ్యి, 1500 తగ్గింపు ఇస్తున్నారు వ్యాపారులు.