పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

బంగారం కొనుగోలు దారులకు పసిడి ధరలు షాకిచ్చాయి.  దేశంలో మరోసారి బంగారం ధరలు పెరిగాయి. కొత్త సంవత్సరంలో వరుసగా మూడు రోజులు తగ్గిన బంగారం ధరలు..  ఆ తర్వాత పెరుగుతూ వస్తున్నాయి.తాజాగా పెరిగిన ధరలతో జనవరి 27వ తేదీ శనివారం తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.100 పెరిగి.. రూ.57,800గా ఉంది. ఇక,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై కూడా రూ.100 పెరిగింది. దీంతో  24 క్యారెట్ల తులం ధర రూ.63,050కు చేరుకుంది. కిలో వెండి ధరపై 500 రూపాయలు పెరిగి.. రూ.78,000గా ఉంది. ఆంధ్రప్రదేశ్ విజయవాడలోనూ బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి.  

దేశ రాజధాని  ఢిల్లీలో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం  ధర రూ.57,950గా ఉండగా,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,200గా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధరపై రూ.500 పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.76,500గా ఉంది.దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం  ధర రూ.57,800గా ఉండగా,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,050గా ఉంది. కిలో వెండి ధర రూ.76,500గా ఉంది.చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం  ధర రూ.58,400గా ఉండగా..  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,710కి చేరుకుంది. కిలో వెండి ధర రూ.78,000గా ఉంది.