శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం కదా.. బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం కదా.. బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

శ్రావణ మాసం అంటేనే శుభప్రదం.. అందులోనూ వరలక్ష్మి వ్రతం అంటే మహిళలకు పవిత్రమైన రోజు. లక్ష్మీదేవిని పూజించటం ఆనవాయితీ. వరలక్ష్మి వ్రతం చేసుకునే వారు.. సెంటిమెంట్ గా ఎంతో కొంత బంగారం కొనుగోలు చేయటం కూడా ఎప్పటి నుంచో వస్తుంది. శుక్రవారం అంటేనే లక్ష్మీదేవి రోజు.. అలాంటిది వరలక్ష్మి వ్రతం రోజు పూజలో బంగారం ఉండటం కామన్. వారి వారి ఆర్థిక స్తోమతను ఆధారంగా ఎంతో కొంత బంగారం కొనుగోలు చేసే వారు ఎందరో ఉన్నారు. ఆగస్ట్ 25వ తేదీ వరలక్ష్మి వ్రతం సందర్భంగా.. హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం...

2023 ఆగస్టు 24 గురువారం రోజున ఉదయం 10 గంటల వరకు ఉన్న ధరలు గమనిస్తే..  దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54వేల 830 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59 వేల 820 గా ఉంది. ఇక దేశ అర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.  54 వేల 500 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59 వేల 450గా ఉంది.  ఆగస్టు 23 బుధవారంతో పోలిస్తే ఇవాళ  (ఆగస్టు 24 ) న10 గ్రాముల బంగారం ధర రూ. 200 పెరిగింది.  

హైదరాబాద్  విషయానికి వస్తే..  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.  54వేల 500గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59 వేల 450 గా ఉంది.  ఇక వెండి ధరలు హైదరాబాద్ లో చూస్తే గ్రాము వెండి రూ. 80 గా ఉండగా, కేజీ వెండి రూ.80 వేలుగా ఉంది. ఆగస్టు 23 బుధవారంతో పోలిస్తే ఇవాళ  (ఆగస్టు 24 ) వెండి  కేజీ ధర రూ. 1500 పెరిగింది.