
విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో బంగారం స్కగ్లింగ్ చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు ఎయిర్ ఇంటలిజెన్స్ అధికారులు. బంగారాన్ని లోదుస్తుల్లో దాచి స్మగ్లింగ్ చేయడానికి పాల్పడినట్టు తెలిపారు. స్మగ్లింగ్ చేస్తున్న వారు.. ఒకరు షార్జానుంచి, మరొకరు హైదరాబాద్ నుంచి వచ్చినట్లు చెప్పారు. 18 లక్షలు విలువ చేసే 554.8 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అధికారులు.