
కొందరు ఎడమచేత్తో రాస్తుంటారు.. వారిని ఎవరైనా చూడగానే.. అరె... నువ్వు లెఫ్ట్ హ్యాండారా? అని అడుగుతారు. అవును అనే సమాధానం రాగానే... లెఫ్ట్ హ్యాండర్స్ అంటే లక్కీ... అనేస్తుంటారు.లక్కీ ఏమో చెప్పలేం కానీ, లెఫ్ట్ హ్యాండర్స్ అంటే స్పెషల్.750 కోట్ల మంది జనాభాలో వంద కోట్ల లోపే లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారని అంచనా.అందుకే .. అంతమందిలో స్పెషల్ అయిపోయినారు వీళ్లు. ఇదొక్కటేనా, ఇంకా చాలా కథ ఉంది. ఆగస్టు 13 లెఫ్ట్ హ్యాండర్స్ డే. అసలేంటి ఈ ఎడమచేతి వాటం వాళ్ల లెక్క? ఎవరెవరు ఎడమచేత్తో రాసేవారు మొదలగు విషయాలను తెలుసుకుందాం. . .!
హ్యాండర్స్ ఎందుకు అవుతారనేది ఇప్పటికీ ఎవ్వరూ కనిపెట్టలేదు. ఒకరు లెఫ్ట్ హ్యాండర్ అన్నది. వాళ్లు ఏ చేత్తో ఎక్కువ పని చేస్తున్నారు .. ఏ చేత్తో రాస్తున్నారో చూసి చెప్పవచ్చు. వీళ్లకు రైట్ హ్యాండర్స్ తో తేడా ఎట్లుందో సైంటిస్ట్ లు చెబుతున్నారు.
మన బ్రెయిన్ లో రెండు భాగాలుంటాయి. లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ అని చెప్పుకుంటారు . ఎడమ చేత్తోటి రాసేవారికి రైట్ సైడ్ బాగా పనిచేస్తుంది. కుడి చేత్తో రాసేవాళ్లకు లెఫ్ట్ సైడ్ బాగా పనిచేస్తుంది. ఈ రైట్ సైడ్ బ్రెయిన్ క్రియేటివిటీకి, ఇమేజినేషన్, ఎమోషనల్ ఎక్స్ ప్రెషన్ కు పెట్టింది పేరు. అందుకే లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువగా క్రియేటివ్ ఉద్యోగాల్లో బాగా సెటిలవుతారు. లీడర్ షిప్ క్వాలిటీలు కూడా బాగా ఎక్కువుగానే ఉంటాయి. అమెరికాకు ప్రెసిడెంట్ గా పనిచేసిన వారిలో నలుగురు లెఫ్ట్ హ్యాండర్సే. స్పోర్ట్స్ లో లెఫ్ట్ హ్యాండర్స్‌కు అడ్వాంటేజ్ ఎక్కువ.
►ALSO READ | Good Fruit: పైనాపిల్.. సూపర్ ఫ్రూట్.. ఇది తింటే ఎన్నో ఆరోగ్య లాభాలు..
లెఫ్ట్ హ్యాండర్స్ బాగా స్మార్ట్ అని ఒక మాట ఉంది. దీనికి సైంటిఫిక్ రీజన్ ఎవ్వరూ ఇవ్వలేదు.
కానీ, రైట్ బ్రెయిన్ ఎక్కువగా వాడతారు కాబట్టి కొంత క్రియేటివ్ ఆలోచిస్తారు. అలానే వీళ్లు ఎక్కువ సక్సెస్ ఫుల్ అని కూడా అంటారు. ఇక్కడ వాళ్లు కేవలం లెఫ్ట్ హ్యాండర్స్ అవ్వడం వల్లనే సక్సెస్ ఫుల్ అయినారని చెప్పడానికి అవకాశం లేదు.
రెండు చేతులతో రాసేటోళ్లు..
లెఫ్ట్ హ్యాండర్స్ ఒక రకం అయితే, రెండు చేతులతో రాసేవారు కూడా ఉన్నారు. దీన్ని యాం బీడెక్స్ ట్రస్ అంటారు. అంటే రెండు చేతులతో రాయగల క్వాలిటీ వీళ్లకు ఉన్నదని, జాతి పిత మహాత్మా గాంధీ రెండు చేతులతో రాసేవాడు. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా రెండు చేతులతో రాసేవారు. మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా యాంబీడెక్స్ ట్రస్‌కు కేటగిరీకి ( రెండు చేతులతో రాసేవారు) చెందిన వారే..!
ఇండస్ట్రీలో నెంబర్ వన్
వివిధ రంగాల్లో పాపులర్ అయిన లెఫ్ట్ హ్యాండర్స్ ఎందరో ఉన్నారు. అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా లెఫ్ట్ హ్యాండర్, క్రికెట్లో మనవాళ్లు దేవుడిలా కొలిచే సచిన్ టెండూల్కర్ లెఫ్ట్ హ్యాండర్, హాలీవుడ్ లో ఇప్పటి నెంబర్ వన్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ లెఫ్ట్ హ్యాండర్. టెక్నాలజీ, బిజినెస్ లో ప్రపంచవ్యాప్తంగా నెంబర్ వన్ నిలిచిన బిల్ గేట్స్ కూడా లెఫ్ట్ హ్యాండర్. ఇలా ఒక్కో ఇండస్ట్రీలో ఎప్పటికీ గుర్తుండిపోయే, నెంబర్ వన్ అనిపించుకున్నవాళ్లెందరో లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు