Good Fruit: పైనాపిల్.. సూపర్ ఫ్రూట్.. ఇది తింటే ఎన్నో ఆరోగ్య లాభాలు..

Good Fruit:  పైనాపిల్.. సూపర్ ఫ్రూట్.. ఇది తింటే ఎన్నో ఆరోగ్య లాభాలు..

పండ్ల మార్కెట్​ కు వెళితే చేతికి గ్లౌజ్​ వేసుకొని పైనాపిల్​ ను కట్​ చేసి ఇస్తారు.  దీనిపైన ముళ్లు ముళ్లుగా ఉండి గుచ్చుకుంటుంది.  చూడటానికి ముళ్లుగా ఉండే ఈ పండువల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి.  అందుకే దీనిని సూపర్​ ఫ్రూట్​అంటున్నారు.  ఇప్పుడు దీని వల్ల కలిగే ఉపయోగాలను ఇప్పుడు తెలుసుకుందాం. . . !

పైనాపిల్ కేవలం రుచికరమైన పండు మాత్రమే కాదు, మధుమేహ నియంత్రణ, బరువు తగ్గడం మరియు గుండె-కాలేయం ఆరోగ్యానికి అద్భుతమైన సూపర్ ఫుడ్. బ్రోమెలైన్ మరియు విటమిన్లు సమృద్ధిగా ఉన్న ఈ పండు అనేక వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది.

పైనాపిల్​ ఇది రుచికరమై పండు.. ఇందులో చాలా విటమిన్లు.. ఖనిజాలు ఉన్నాయి.  దీనిని తరచుగా తినే వారికి ఆరోగ్య పరంగా అనేక ఉపయోగాలున్నాయి.  దీనిని తినడం వలన  గుండె జబ్బులు, మధుమేహం, కాలేయం ,  ఊబకాయం సమస్యలను దూరంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

ఇందులో ఏమేమి ఉన్నాయంటే...

పైనాపిల్‌లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది.  ఇది రక్తాన్ని పలుచగా చేసి మంటను తగ్గిస్తుంది. గుండెపోటు ..  స్ట్రోక్  రాకుండా ఎంతో ఉపయోగపడుతుందని  పరిశోధకులు చెబుతున్నారు. శరీరంలో కండరాలకు రక్త ప్రసరణలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తుంది.  ఇంకా  ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వలన ...  ఇది ధమనులను బలోపేతం చేస్తుంది. ప్రస్తుత రోజుల్లో బీపీ అందరికి ప్రధాన సమస్యగా మారింది.  ఇందులో ఉండే పొటాషియం అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. 

డయాబెటిస్ ఉన్నవారు తినవచ్చా?

పైనాపిల్ పండును మధుమేహంతో బాధ పడేవారు మితంగా తినాలని వైద్యులు సూచిస్తున్నారు.  పైనాపిల్​ లో చక్కెర ఉంటుంది. ఇందులో  గ్లైసెమిక్ ఇండెక్స్  మధ్యస్థంగా ఉంటుంది.  అందువలన తక్కువగా తినడం వలన షుగర్​ పెరగదు. ఇందులో ఫైబర్...  నీరు కూడా ఉంటాయి, ఇది చక్కెర శరీరంలోకి నెమ్మదిగా ప్రవేశించడానికి వీలు కల్పిస్తుంది.

►ALSO READ | Good Health : బరువు తగ్గటానికి ఈ డైట్ మంచిదేనా.. : ఈ డైట్ లో ఏముంటాయి.. ఎలా పని చేస్తుందో చూద్దాం..

పైనాపిల్‌లో విటమిన్ సి, మాంగనీస్..  యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి .  ఇవి కాలేయాన్ని దెబ్బతినకుండా కాపాడతాయి. బ్రోమెలైన్  జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది.  ఇది కాలేయంపై భారాన్ని తగ్గించి ఫ్యాటీ లివర్ వంటి వ్యాధులు దరి చేరకుండా ఎంతో ఉపయోగకారిగా ఉంది.  పైనాపిల్‌లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.   100 గ్రాములకు కేవలం 42 కేలరీలు మాత్రమే ఉంటాయి.  ఇందులో అస్సలు కొవ్వు ఉండదు. ఇది సహజంగా స్వీట్​గా ఉంటుంది. ఇది శరీరానికి  ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది.