
హైదరాబాద్ చందానగర్ లో వరుస చోరీలతో బెంబేలెత్తిస్తున్నారు దొంగలు. మంగళవారం ( ఆగస్టు 12 ) ఖజానా జ్యూవెలరీ చోరీని మరువక ముందే.. ఇవాళ ( ఆగస్టు 13 ) గోపనపల్లిలోని సేవాలాల్ ఆలయంలో హుండీ చోరీకి పాల్పడ్డారు దుండగులు. వరుస చోరీలతో పోలీసులు సైతం తలలు పట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది చందానగర్ లో. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపీనాపల్లి గ్రామం సేవాలాల్ ఆలయంలో హుండీ చోరీ కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
మంగళవారం ఖజానా జ్యూవెలర్స్ చోరీని మరువక ముందే చందానగర్ పోలీసులకు మరో సవాల్ విసిరారు దుండగులు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపనపల్లి గ్రామంలో ఉన్న సేవాలాల్ ఆలయంలో హుండిలోని నగదు ఎత్తుకెళ్లారు దుండగుడు.చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
►ALSO READ | ఖమ్మంలో గంజాయి బ్యాచ్ వీరంగం.. దుకాణానికి నిప్పంటించి.. యజమానిపై దాడి..
ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు ఆలయ సిబ్బంది. సిబ్బంది ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఘటనాస్థలికి చేరుకొని క్లూస్ టీం ఇచ్చిన ఆధారాలతో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. వరుస చోరీలతో చందానగర్ వాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఆలయాలు, ఇళ్ళు, షాపులు అన్న తేడా లేకుండా జరుగుతున్న వరుస చోరీలతో పోలీసులు సైతం తలలు పట్టుకుంటున్నారు.