శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టివేత

శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టివేత

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయి నుండి అక్రమంగా 3.14 కిలోల బంగారం తెచ్చిన ఓ ప్రయాణికుడు దానిని ఎయిర్ పోర్టు ఉద్యోగికి ఇచ్చాడు. 1.65 కోట్ల విలువ చేసే బంగారు గొలుసులను ఓ కవర్లో పెట్టి ఎయిర్ పోర్టులో పని చేసే మహ్మద్ అబ్దుల్ లాయిక్ అప్పగించాడు. అయితే దానిని బయటకు తరలించే యత్నం చేసిన సదరు ఉద్యోగిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బంగారాన్ని సీజ్ చేసి అబ్దుల్ పై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం ఎన్ని రోజుల నుండి సాగుతుందనే కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం

చదువు కోసం సాహసం.. ప్రమాదకరంగా బాలల ప్రయాణం

కోతుల మధ్య ఆప్యాయత..మనషులను మించి..