హైదరాబాద్ సిటీలో పట్టపగలు.. బంగారం షాపు దోపిడీ

హైదరాబాద్ సిటీలో పట్టపగలు.. బంగారం షాపు దోపిడీ

హైదరాబాద్ సిటీలో పట్టపగలు అంటే జనం ఎలా తిరుగుతారు.. నిత్యం రద్దీగానే ఉంటాయి రోడ్లు.. అలాంటి ఏరియాల్లో మేడ్చల్ కూడా ఒకటి.. అలాంటి ప్రాంతంలో.. పట్ట పగలు బంగారం షాపులోకి వచ్చిన దోపిడీ దొంగలు.. కత్తితో షాపు ఓనర్ ను పొడిచి.. బంగారం దోచుకుని.. బైక్ పై వెళ్లిపోయారు.. సమీపంలోనే పోలీస్ స్టేషన్ సైతం ఉండటం మరింత సంచలనంగా మారింది. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే...

జూన్ 20వ తేదీ గురువారం మధ్యాహ్నం మేడ్చల్  పోలీస్ స్టేషన్ కు ఆనుకొని ఉన్న జగదాంబ జ్యూవెలరీ షాపుకు ఇద్దరు వచ్చారు. ఇందులో ఒకరు మాస్క్, మరొకరు బురఖాను ధరించి షాపులోకి వచ్చారు. బంగారం కొనే విధంగా నటించిన బురఖా దొంగ తన దగ్గర ఉన్న కత్తితో షాప్ ఓనర్ శేషారంపై దాడి చేసి దొరికినంత బంగారాన్ని ఎత్తికెళ్లారు.  వెంటనే  షాప్ ఓనర్ కేకలు వేయడంతో దొంగలు బైక్ పై అక్కడినుండి  పరారయ్యారు. 

పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ ను సైతం లెక్కచేయకుండా బంగారం దోపిడీ చేసి పారిపోయారు దొంగలు.  ఇదంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాలతో రికార్డు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. దొంగలను అంతరాష్ట్ర ముఠాగా గుర్తించారు. బంగారం ఎంత పోయిందో తెలియాల్సి ఉంది.