మేకప్ కిట్లో బంగారం దాచి తెచ్చాడు

మేకప్ కిట్లో బంగారం దాచి తెచ్చాడు

అరబ్ దేశాల నుంచి భారత్ కు అక్రమంగా బంగారాన్ని తీసుకొచ్చేందుకు కొత్త కొత్త పద్ధతులు అనుసరిస్తున్నారు.  తాజాగా దుబాయ్ నుంచి హైదరాబాద్ కు విమానంలో వచ్చిన ఓ వ్యక్తి 220 గ్రాముల బంగారాన్ని తనతో పాటు తీసుకొచ్చాడు. కుర్తా బటన్ లు, మేకప్ కిట్లలో గోల్డ్ ను దాచి తెచ్చాడు. హైదరాబాద్ కస్టమ్స్ ఇంటెలిజెన్స్ అధికారులు అతడిని తనిఖీ చేయగా.. దాచిన బంగారం బయటపడింది. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపు రూ.11 లక్షలు ఉంటుందని గుర్తించారు.