గణపతి చేతిలో బంగారు లడ్డు..

గణపతి చేతిలో బంగారు లడ్డు..

గణేష్  ఉత్సవాల్లో నిమజ్జనానికి ఎంత ప్రాముఖ్యత ఉందో లడ్డూలకు అంతే ప్రాముఖ్యత ఉంటుంది. నవరాత్రులు పూజలందుకున్న లడ్డూలను  కొనేందుకు భక్తులు పోటీపడుతుంటారు. లడ్డు ధర ఎంతైనా సరే వేలం పాటలో  దక్కించుకుంటారు. అయితే కొందరు  ప్రసాదం, లడ్డుతో పాటు బంగారు లడ్డును ఏర్పాటు చేసి వేలం వేస్తున్నారు.

హైదరాబాద్ నారాయణగూడ  స్ట్రీట్ నెంబర్ 5లో  ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో   గణనాథుడు చేతులో ప్రత్యేకంగా తయారు చేసిన బంగారు లడ్డును పెట్టారు.  జై శ్రీ గణేష్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వాహకులు తులం బంగారంతో తయారు చేసిన లడ్డు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

గత 24 ఏళ్లుగా గణేష్ విగ్రహాన్ని పెడుతున్నట్లు నిర్వాహకులు అనిష్ గంగపుత్ర , నర్సింగ్ గౌడ్ లు తెలిపారు. నిమజ్జనం రోజు 15 కిలోల లడ్డుతో  కలిపి ఈ బంగారు లడ్డును కూడా వేలం వేస్తామని చెప్పారు.