గొల్ల కుర్మలకు న్యాయం చేయాలి

గొల్ల కుర్మలకు న్యాయం చేయాలి

దుబ్బాక, వెలుగు :  డీడీలు కట్టినా గొర్రెలు పంపిణీ చేయడం లేదని ఆరోపిస్తూ గురువారం సిద్దిపేట జిల్లా అక్భర్​పేట-భూంపల్లి మండల చౌరస్తాలో గొల్ల కుర్మలు రాస్తారోకో చేశారు. దీంతో మెదక్​-సిద్దిపేట జాతీయ రహదారిపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ సందర్భంగా గొల్ల కుర్మల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఉడుతల మల్లేశం మాట్లాడుతూ.. గొల్ల కుర్మలతో డీడీలు కట్టించుకున్న రాష్ట్ర ప్రభుత్వం గొర్రెలను పంపిణీ చేయకుండా అన్యాయం చేస్తోందని ఆరోపించారు.

గొర్రెల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో రూ. లక్షా75 వేలను జమ చేయాలని డిమాండ్​ చేశారు. 50 ఏళ్లు నిండిన ప్రతి గొల్ల కుర్మలకు రూ. 3 వేల పెన్షన్​ ఇవ్వాలని, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 6 లక్షల ఇన్సూరెన్స్​ ప్రకటించాలన్నారు. గొర్రెలను మేతకు తీసుకెళ్లడానికి ప్రతి గ్రామంలో 20 ఎకరాల భూమిని కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోపాల్​ యాదవ్​, యాదమల్లు, దండబోయిన రాజు పాల్గొన్నారు.