మంచి పనులే చివరిదాకా గుర్తుంటాయి :  మంత్రి వాకిటి శ్రీహరి

మంచి పనులే చివరిదాకా గుర్తుంటాయి :  మంత్రి వాకిటి శ్రీహరి

ఊట్కూర్, వెలుగు :  సమాజంలో చేసిన మంచి పనులు చివరి వరకు గుర్తుండిపోతాయని పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణపేట జిల్లా ఊట్కూరు మండల కేంద్రంలోని జడ్పీహెచ్​ఎస్​లో బీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా హెల్త్ క్యాంపును మంత్రి ప్రారంభించారు. తాను సంపాదించిన డబ్బులో కొంత సమాజం కోసం ఖర్చు పెడుతున్న బాలకృష్ణారెడ్డి సేవలు అభినందనీయమన్నారు.

మండల ప్రజలు ఉచిత మెగా హెల్త్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. హెల్త్ క్యాంపులో 1400 మంది వైద్య సేవలను సద్వినియోగము చేసుకున్నట్లు బాలకృష్ణారెడ్డి తెలిపారు.  డీఎంహెచ్​వో జయచంద్ర మోహన్,  ఆర్డీవో రమేశ్, సర్పంచ్ రేణుక, సింగిల్ విండో చైర్మన్ బాల్ రెడ్డి,  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సూర్య ప్రకాశ్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు లింగం పాల్గొన్నారు.