అదానీ కాపర్ ప్లాంట్‌‌తో ఇండియాకు మేలు

అదానీ కాపర్ ప్లాంట్‌‌తో ఇండియాకు మేలు

న్యూఢిల్లీ:  అదానీ గ్రూప్  గుజరాత్‌‌లోని ముంద్రా వద్ద అతిపెద్ద  కాపర్  మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌‌ను ఏర్పాటు చేయబోతోంది.  దీంతో దేశ కాపర్‌‌‌‌ దిగుమతులు తగ్గుతాయని, గ్రీన్ ఎనర్జీకి షిఫ్ట్ కావడంలో సాయపడుతుందని ఎనలిస్టులు చెబుతున్నారు.  1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడితో అతి పెద్ద సింగిల్ లొకేషన్ ప్లాంట్‌‌ను 2‌‌‌‌029 మార్చి నాటికి పూర్తి చేయాలని అదానీ గ్రూప్ చూస్తోంది.

రెండు దశల్లో ప్లాంట్‌‌ పూర్తకానుండగా, మొదటి దశలో ఏడాదికి 5 లక్షల టన్నుల కెపాసిటీతో అందుబాటులోకి రానుంది.  ఈ కాపర్ రిఫైనరీ ప్లాంట్‌‌ను ఏర్పాటు చేయడానికి కచ్‌‌ కాపర్ లిమిటెడ్‌‌ (కేసీఎల్‌‌) పేరుతో ఓ సబ్సిడరీ కంపెనీని అదానీ గ్రూప్ ఏర్పాటు చేసింది.ఈ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి అదానీ గ్రూప్ సిండికేట్ బ్యాంక్‌‌ల నుంచి అప్పు దక్కించుకుంది కూడా. కాగా, 2022 ఏప్రిల్‌‌ – 2023 మార్చి మధ్య ఇండియా 1,81,000 టన్నుల కాపర్‌‌‌‌ను దిగుమతి చేసుకుంది. 2027 నాటికి  దేశంలో 7,50,000 టన్నుల కాపర్ అవసరం అవుతుందని అంచనా.