
ఒడిశాలోని బాలాసోర్‌లో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పెను ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం తర్వాత రైల్వే శాఖ.. పలు రైళ్లను రద్దు చేసింది. అనంతరం సిబ్బంది నిరంతరాయంగా శ్రమించి ట్రాక్ పునరుద్ధరించి రైళ్ల రాకపోకలకు మార్గం సుగమం చేశారు. దీంతో మూడు రోజుల తర్వాత చెన్నై-షాలిమర్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ మళ్లీ పరుగులు పెట్టింది. ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు రైలు బయలుదేరుతున్నట్టు రైల్వే శాఖ.. మెసేజ్‌ల ద్వారా సమాచారం అందించింది. నిన్న ఉదయం 10.45 గంటలకు చెన్నై సెంట్రల్ నుంచి కోరమాండల్ తన సేవలు ఆరంభించింది.
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్.. చెన్నై సెంట్రల్ నుండి షాలిమార్ కు, షాలిమార్ నుండి ప్రతిరోజు ప్రయాణం సాగిస్తుంటుంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ప్రకారం.. రైలు నంబర్ 12842 చెన్నై సెంట్రల్ నుండి ఉదయం 7 గంటలకు తన ప్రయాణాన్ని ప్రారంభించి, మరుసటి రోజు అనగా గురువారం ఉదయం 10:40 గంటలకు షాలిమార్ చేరుకోనుంది. తిరిగి రైలు నంబర్ 12841, జూన్ 7న గురువారం మధ్యాహ్నం 15:20 సమయంలో షాలిమార్ నుండి బయలుదేరి మరుసటి రోజు అనగా శుక్రవారం సాయంత్రం 16.50కి చెన్నై సెంట్రల్‌కు చేరుకోనుంది.