- నాన్ యూరియా ధరలు పెంచొద్దు
- ఫర్టిలైజర్ కంపెనీలకు కేంద్రం ఆదేశం
న్యూఢిల్లీ: డీఏపీ, ఇతర నాన్ యూరియా ఎరువుల రేట్లను పెంచొద్దని ఫర్టిలైజర్ కంపెనీలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. వీటిని ఇదివరకు ఉన్న ఎంఆర్పీ ధరలకే అమ్మాలని స్పష్టం చేసింది. డీఏపీతో పాటు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ (ఎంవోపీ), ఎన్ పీకే ఎరువుల ధరలు పెంచొద్దని కేంద్రం ఆదేశించగా, కంపెనీలు అందుకు ఒప్పుకున్నాయని శుక్రవారం కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. రైతులకు నాన్ యూరియా ఫర్టిలైజర్స్ పాత రేట్లకే అందుబాటులో ఉంటాయని తెలిపారు. అంతర్జాతీయంగా ముడి సరుకుల ధరలకు అనుగుణంగా డీఏపీ ధరను రూ. 1200 నుంచి రూ. 1700 వరకూ పెంచామని, ఈ ధరలు ఏప్రిల్ 1 నుంచే అమలులోకి వచ్చాయని గురువారం పలు కంపెనీలు, కోఆపరేటివ్ లు ప్రకటించాయి. అయితే రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ధరలు పెంచొద్దని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.
