హైదరాబాదీలకు గుడ్ న్యూస్ : అర్థరాత్రి ఒంటి గంట వరకు షాపులు, హోటల్స్

హైదరాబాదీలకు గుడ్ న్యూస్ : అర్థరాత్రి ఒంటి గంట వరకు షాపులు, హోటల్స్

హైదరాబాద్‌ నగరవాసులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. అర్థరాత్రి ఒంటిగంట వరకు నగరంలో దుకాణాలు తెరిచే ఉండొచ్చని వ్యాపార వర్గాలకు తీపి కబురు చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.ఇక నుంచి హైదరాబాద్‌లో హోటళ్లు, దుకాణాలు ఒంటి గంట వరకు ఓపెన్ చేసి వ్యాపారాలు కొనసాగించుకోవచ్చని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే మద్యం దుకాణాలు, బార్లు తప్ప మిగతా వాటికి రాత్రి ఒంటి గంట వరకు వ్యాపారాలు చేసుకునేందుకు పూర్తి అనుమతులు ఇస్తున్నట్టు సభలో వెల్లడించారు. 

మద్యం షాపుల విషయంలో మాత్రం ఎలాంటి మినహాయింపులు ఇవ్వబోమని  సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.  ఎక్కువ సేపు మద్యం షాపులు తెరిచి ఉంటే జనం అంతే ఎక్కువగా మద్యం తాగుతారని అన్నారు. మద్యం దుకాణాలు తప్ప మిగిలిన దుకాణాలు తమ వ్యాపారాలు కొనసాగించుకోవచ్చని చెప్పారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పరిధిలో మద్యం దుకాణాలు తప్ప మిగతా అన్ని షాపులు తెరుకోడానికి పర్మిషన్ ఇస్తున్నామన్నారు. ఈ విషయమై ఇప్పటికే పోలీసులకు ఆదేశాలిచ్చినట్లు రేవంత్ వెల్లడించారు. 

హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో రాత్రి 11 గంటలకే పోలీసులు వచ్చి షాపులు క్లోజ్ చేయాలని వ్యాపారస్తులను ఒత్తిడి చేస్తున్నారని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సీఎం రేవంత్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి రాత్రి ఒంటివరకు వ్యాపారాలు చేసుకోవచ్చని అనుమతులు జారీ చేశారు. దీంతో హైదరాబాద్‌లో నైట్ లైఫ్ మళ్లీ మొదలుకానుంది.