ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్.. కరోనా కోత జీతం చెల్లించాలని సీఎం కేసీఆర్ ఆదేశం

ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్.. కరోనా కోత జీతం చెల్లించాలని సీఎం కేసీఆర్ ఆదేశం

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు సర్కార్ గుడ్ న్యూస్ ప్రకటించింది. కరోనా నేపధ్యంలో ఆర్టీసీ ఉద్యోగుల జీతంలో రెండు నెలలపాటు కోత విధించిన 50 శాతం మొత్తాన్ని వెంటనే చెల్లించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇవాళ ఆర్టీసీపై ఉన్నతాధికారులతో సమీక్ష చేసిన సీఎం కేసీఆర్ దీపావళి పండుగ వేళ కార్మికులకు ఈ గుడ్ న్యూస్ ప్రకటించారు. దాదాపు రూ. 120 నుంచి రూ. 130 కోట్లు విడుదల చేయాలని ఆర్థికశాఖకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.

ఆర్టీసీలో ఉద్యోగ భద్రతపై కూడా త్వరలోనే విధానపర నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. పార్సిల్ సర్వీసుల బిజినెస్ లో అప్పుడే 1 మిలియన్ దాటిందన్న అధికారుల ప్రకటనతో ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. అధికారులను అభినందించారు. కరోనా ప్రభావం తగ్గిపోతున్నందున ఇకపై హైదరాబాద్ లో 50 శాతం బస్సు సర్వీలను పునరుద్ధరించాలని ఆర్టీసీ ఎండీ సునీల్ కుమార్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.