హైదరాబాద్ సిటీ, వెలుగు: ఈ నెల 15న మల్లేపల్లి లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎంప్లాయీ మెంట్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ నర్సయ్య శుక్రవారం తెలిపారు. చర్లపల్లిలో ని డైసెన్ క్రాప్ కంపెనీల్లో 100 ఉద్యోగాల భర్తీ చేస్తున్నట్లు, ఈ కంపెనీలో టెక్నికల్ ఉద్యోగాల కోసం ఈ మేళా నిర్వహిస్తున్నా రన్నారు.
మల్లేపల్లిలోని ఐటీఐ క్యాంపస్లో జాబ్ మేళా ఉంటుందన్నారు. ఫిట్టర్, వెల్దర్లో ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులు హాజరుకావచ్చని పేర్కొన్నారు. అనుభవం లేకపోయినా అవకాశంఉంటందని, జీతం ໕.18,000 25,000 ఉంటుందన్నారు.

