Meta : ఇకపై ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ సెటింగ్స్‌ ఒకేచోట..

Meta : ఇకపై ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ సెటింగ్స్‌ ఒకేచోట..

ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, మెసెంజర్‌ వంటి ఖాతాలు వాడే వారికి గుడ్ న్యూస్. ఈ ఖాతాలు వాడే వారికి మెటా గుడ్ న్యూస్ అందించింది. మెటా కొత్తగా అకౌంట్‌ సెంటర్‌ను ప్రవేశపెట్టనుంది. ఒకటి కన్నా ఎక్కువ మెటా ఖాతాలను వాడేవారి యూజర్స్ కు ఎంతగానో ఉపయోగపడుతుంది. పర్సనల్ విషయాలు, పాస్‌వర్డ్‌లు, సెక్యూరిటీ, యాడ్‌ ప్రిఫరెన్సుల ఇలా చాలా విషయాలు అకౌంట్ సెంటర్‌లోనే ఇకపై ఉండనున్నాయి. దీంతో వివిధ యాప్‌లు వాడేవారికి సెట్టింగ్స్‌ను మేనేజ్‌ చేసుకోవటం తేలికవుతుంది. 

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను అకౌంట్‌ సెంటర్‌కు యాడ్ చేస్తే.. వాటికి సంబంధించిన యాడ్‌ టాపిక్‌ ప్రిఫరెన్సులను చాలా ఈజీగా నిర్ణయించుకోవచ్చు. అకౌంట్‌ సెంటర్‌లో మార్చుకుంటే రెండింటికీ వర్తిస్తుంది. ఒకవేళ కావాలనుకుంటే తమ ఖాతాలను ఈ సెంటర్‌లో వేర్వేరుగానూ ఉంచుకోవచ్చు. ఇందుకోసం అదే అకౌంట్స్‌ సెంటర్‌కు ఒకటి కన్నా ఎక్కువ ఖాతాలను యాడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని యాడ్‌ సెటింగ్స్‌ కంట్రోళ్లను మెరుగుపరచటం మీద మెటా ఫోకస్ పెట్టింది. తమకు ఇష్టం లేని యాడ్స్‌ను తక్కువగా.. అదే సమయంలో ఇష్టమైన యాడ్స్‌ను ఎక్కువగా చూసేలా సెటింగ్స్‌ను మార్చుకోవటానికి చాన్స్ కల్పించనుంది.