ఉద్యోగులను తీసేసే ఆలోచన లేదు : ఉబెర్ సీఈవో

ఉద్యోగులను తీసేసే ఆలోచన లేదు : ఉబెర్ సీఈవో

ప్రపంచంలోని అగ్రశ్రేణి ఐటీ కంపెనీలు, స్టార్టప్ కంపెనీలు ఉద్యోగులను వదిలించుకునే పనిలో పడ్డాయి. కాస్ట్ కట్టింగ్ పేరుతో ఎంప్లాయిస్ ను ఇంటికి సాగనంపుతున్నాయి. క్యాబ్ సర్వీస్ కంపెనీ ఉబెర్ కూడా ఇదే బాటలో పయనిస్తోందని వార్తలు వస్తున్నాయి. వాటిపై ఉబెర్ క్లారిటీ ఇచ్చింది. కంపెనీ ఉద్యోగుల్ని తొలగించడం లేదని స్పష్టం చేసింది. ఇటీవల స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న ఉబెర్ సంస్థ సీఈవో దారా ఖో స్రోషాహి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఉబెర్ ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. కాస్ట్ కటింగ్ లో భాగంగా పలు కంపెనీలు ఉద్యోగులను తీసివేస్తున్న సమయంలో సీఈవో ప్రకటనతో కంపెనీ ఉద్యోగులంతా ఊపిరి పీల్చుకున్నారు.