నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోటీ పరీక్షలకు వయోపరిమితి పెంపు..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోటీ పరీక్షలకు వయోపరిమితి పెంపు..

తెలంగాణ ప్రభుత్వ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగ నియామకాల పై కీలక  నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ నియామక పరీక్షల్లో వయోపరిమితిని పెంచుతున్నట్టు తెలంగాణ సీఎస్ శాంతి కుమారీ ఉత్తర్వులు జారీ చేశారు. నిరుద్యోగుల వయోపరిమితి 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పొడిగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో తెలిపారు. ఈ ఉత్తర్వుల్లో యూనిఫామ్ సర్వీస్ కు మినహాయింపు ఇచ్చింది. 

ALSO READ :- కేసీఆర్ వచ్చినాకే.. ఏపీ జలదోపిడీ ఎక్కువ.. ఇవిగో లెక్కలు : మంత్రి ఉత్తమ్

కొన్ని రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి తొందర్లోనే మెగా డీఎస్సీ, గ్రూప్స్ నోటిఫికేషన్, పోలీస్ రిక్రూట్మెంట్ కు సంబంధించి ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వం వయో పరిమితి పెంచడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.