గుడ్ న్యూస్: టికెట్ లేకున్నా రైలు ఎక్కొచ్చు

గుడ్ న్యూస్: టికెట్ లేకున్నా రైలు ఎక్కొచ్చు
  • ప్లాట్ ఫాం టికెట్ తీసుకుంటే చాలు రైలులో టీసీ దగ్గర టికెట్ తీసుకోవచ్చు
  • అవసరమైతే బెర్త్ రిజర్వేషన్ తీసుకోవచ్చు
  • బెర్త్ దొరక్కపోయినా రైలులో ప్రయాణం కొనసాగించవచ్చు
  • టీసీకి రూ.250 జరిమానా కట్టి రైలు జర్నీ కొనసాగించవచ్చు

రైలు ప్రయాణికులకు శుభవార్త. నిజంగానే గొప్ప ఊరటకలిగించే మంచి వార్త. 
రైలు ప్రయాణమంటే స్టేషన్లో టికెట్ కోసం పెద్ద క్యూలో నిలబడి.. చివరి నిమిషంలో రైలు మిస్సయిపోయి.. టికెట్ తీసుకున్నా రైలెక్కలేకపోయిన ఉదంతాలు ఎన్నో. అయితే ఇలాంటివి ఇక ముందు ఉండకపోవచ్చు. ఎందుకంటే రైలు ఎక్కడానికి కేవలం ప్లాట్ ఫామ్ టికెట్ ఉంటే చాలు అంటూ గొప్ప వెసులుబాటు కలిగించింది రైల్వే శాఖ. 
రైల్వేశాఖ తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం రైలు ప్రయాణికులు టికెట్ కోసం క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. కేవలం ప్లాట్ ఫామ్ టికెట్ తీసుకుంటే చాలు. దాన్ని కూడా ఇప్పుడు యూటీసీ యాప్ ద్వారా లేదా రైల్వే స్టేషన్లలోని వెండింగ్ మిషన్ల ద్వారా ప్లాట్ ఫామ్ తీసుకుంటే చాలు. రైలు ఎక్కిన తర్వాత దాన్ని టీటీఈకి చూపించి మీరు వెళ్లాల్సిన స్టేషన్ వరకు టికెట్ తీసుకోవచ్చు. అవసరమైతే రిజర్వేషన్ కూడా చేయించుకోవచ్చు. ఒకవేళ మీరు ఎక్కిన రైళ్లో సీట్లు లేకున్నా.. బెర్త్ దొరకకున్నా నిరభ్యంతరంగా రైలు ప్రయాణం కొనసాగించవచ్చు. 
రిజర్వేషన్ బోగీలో రూ.250 జరిమానా
టికెట్ లేకుండా రైలులో ప్రయాణించే వారికి టీటీఈ గరిష్టంగా 250 రూపాయల జరిమానా విధిస్తారు. టికెట్ దొరకలేదనో.. బెర్త్ ఉందో లేదో తెలియడం లేదనో రైలు ప్రయాణాలు మానుకునే వారికి ఈ వార్త గొప్ప ఊరట కలిగిస్తుంది. ఎంత పెద్ద పెనాల్టి చెల్లించాలనో టెన్షన్ లేకుండా దీనిపై కూడా క్లారిటీ ఇచ్చింది. టికెట్ తీసుకోవడం కోసం క్యూలో నిలబడే హైరానా తప్పించుకోవడం కోసం కేవలం ప్లాట్ ఫామ్ టికెట్ తోనే రైలు ప్రయాణం చేయవచ్చని.. అలాగే ప్లాట్ ఫామ్ టికెట్ తోనే రైలు ఎక్కిన వారు తాము ఎక్కిన రైలులోనే ప్రయాణిస్తూ ఆన్ లైన్ ద్వారా రిజర్వేషన్ కూడా చేసుకోవచ్చని రైల్వేశాఖ ప్రకటించింది.