పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఢిల్లీ రూటులో ట్రైన్స్ బంద్

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఢిల్లీ రూటులో ట్రైన్స్ బంద్

యూపీలోని బృందావన్ వద్ద శుక్రవారం రాత్రి గూడ్స్ రైలు తప్పింది. దీంతో మధుర నుంచి ఢిల్లీ వెళ్లే రూట్ లో ట్రైన్ సర్వీసులు పూర్తిగా బంద్ అయ్యాయి. అంతా క్లియర్ చేసి.. మళ్లీ రైళ్లు నడవాలంటే శనివారం సాయంత్రం వరకూ పట్టొచ్చని రైల్వే అధికారులు తెలిపారు.

మహారాష్ట్రలోని నింబా స్టేషన్ నుంచి ఘజియాబాద్ కు వెళ్తున్న గూడ్స్ రైలు నిన్న రాత్రి 11.30 గంటల సమయంలో బృందావన్ రోడ్డు, భుతేశ్వర్ స్టేషన్ల మధ్య పట్టాలు తప్పింది. దీంతో 15 బోగీలు అడ్డదిడ్డంగా పడిపోయాయి. రైలు వేగం ఎక్కువగా ఉన్న సమయంలో పట్టాలు తప్పడంతో బోగీలు ఆ మార్గంలో ఉన్న మూడు ట్రాక్స్ పైనా అడ్డంగా పడ్డాయని ఆగ్రా డివిజన్ రైల్వేస్ పీఆర్వో ఎస్కే శ్రీవాస్తవ చెప్పారు. పట్టాలపై పడిన బోగీలను క్లియర్ చేసే పనులు చేస్తున్నామని, 300 మంది వర్కర్లు ఈ పనిలోనే ఉన్నారని చెప్పారు. మూడు ట్రాక్స్ పైనా బోగీలు అడ్డంగా పడిపోవడంతో ఈ రూట్ నుంచి ఢిల్లీ వైపు వెళ్లే రైళ్లు పూర్తిగా నిలిపేసినట్లు తెలిపారు. అయితే బోగీలను తొలగించి, ట్రైన్ సర్వీసులను పునరుద్ధరించడానికి ఈ రోజు సాయంత్రం వరకూ పట్టే అవకాశం ఉందన్నారు.

మరిన్ని వార్తల కోసం..

బీజేపీ తప్ప.. ఏ పార్టీతోనైనా పొత్తుకు రెడీ

చూపే బంగారమాయెనే శ్రీవల్లి అంటున్న డేవిడ్ భాయ్