లేఆఫ్స్‌ .. గూగుల్‌లో వెయ్యి మంది ఉద్యోగులు తొలిగింపు

 లేఆఫ్స్‌  ..  గూగుల్‌లో వెయ్యి మంది ఉద్యోగులు తొలిగింపు

ప్రముఖ ఐటీ సంస్థ గూగుల్‌ 1000 మంది ఉద్యోగులును తొలిగిస్తున్నట్లు ప్రకటించింది.  గూగుల్ హార్డ్‌వేర్‌, సెంట్ర‌ల్ ఇంజనీరింగ్ టీమ్‌లు, గూగుల్ అసిస్టెంట్ స‌హా ప‌లు విభాగాల్లోని  ఉద్యోగులకు లేఆఫ్స్‌ మెయిల్స్ పంపినట్లు తెలిపింది.  లేఆఫ్స్ గురించి ముంద‌స్తు స‌మాచారం ఇవ్వలేక‌పోయినందుకు చింతిస్తున్నామ‌ని మెయిల్‌లో కంపెనీ పేర్కొంది. 

తొలిగింపు సమయంలో అదనపు చెల్లింపులు  చేయనున్నట్లు పేర్కొంది.  వారు కంపెనీలోని ఇతర విభాగాల్లో అందుబాటులో ఉన్న ఉద్యోగాలకు ధరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్సిస్తామని తెలిపింది.  కంపెనీలో తిరిగి అవ‌కాశం ద‌క్కని ఉద్యోగులు 2024 ఏప్రిల్‌లో కంపెనీని వీడాల‌ని తెలిపింది. చివరిగా 2023 జనవరిలో గూగుల్ 12 వేల మంది వరకు ఉద్యోగుల్ని తొలగించింది. 

గతేడాది పలు టెక్ సంస్థలు భారీగా ఉద్వాసనలు పలికాయి  కొత్త  సంవత్సరంలోనూ అదే ఒరవడిని కొనసాగిస్తున్నాయి.  ఈ నెల 15 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 48 టెక్ కంపెనీలు 7,528 మంది నిపుణులను ఇంటికి సాగనంపాయని లే-ఆఫ్ ట్రాకింగ్ వెబ్ సైట్ లే-ఆప్స్.ఎఫ్‌వైఐ ప్రకటించింది. 2023లో 1150కి పైగా టెక్ కంపెనీలు 2.60 లక్షల మందికి పైగా ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు ఇచ్చాయి.