
గూగుల్ (Google) గత కొన్ని నెలల్లోనే వేలాది మంది ఉద్యోగులను తొలగించింది. మరో బ్యాడ్ న్యూస్ ఏమిటంటే 2024 ఈ దిగ్గజ సెర్చింగ్ కంపెనీ మరిన్ని ఉద్యోగాల కోతలను విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల వెలువడిన ఓ నివేదికలో ది వెర్జ్ కోట్ చేసిన అంతర్గత మెమోలో కంపెనీ చీఫ్ సుందర్ పిచాయ్ భారీ మార్పులను సూచించారు. తమకు ప్రతిష్టాత్మకమైన లక్ష్యాలున్నాయని, ఈ సంవత్సరం తాము ప్రాధాన్యత ఉన్న వాటిల్లో పెట్టుబడి పెడతామని చెప్పారు. ఈ పెట్టుబడి కోసం సామర్థ్యాన్ని సృష్టించడానికి తాము కఠిన నిర్ణయాలు తీసుకోవాలని పిచాయ్ నుండి కోట్ చేసిన మెమో పేర్కొంది.
కంపెనీ సిబ్బంది సంఖ్యను క్రమబద్ధీకరించాల్సిన అవసరం గురించి కూడా పిచాయ్ మాట్లాడారు. అయితే దీన్ని లేఆఫ్ అనడాన్ని ఆయన వ్యతిరేకించారు. దీనికి బదులుగా సంస్థలో మీరు అవసరం లేదని ప్రజలకు చెప్పడానికి ఇది ఒక ఫ్యాన్సీయర్ మార్గమన్నారు. అంతకుముందు గూగుల్ 2023లో భారీ తొలగింపులకు పూనుకుంది. అయితే 2024లో మాత్రం ఆ స్కేల్‌ని చేరుకోలేమని, కానీ ప్రతి టీమ్‌ను తొలగించే ప్రమాదం ఉండదని పిచాయ్ తేల్చి చెప్పారు.
వాస్తవానికి, ఈ వారం ప్రారంభంలో గూగుల్ తన అడ్వర్టైజింగ్ సేల్స్ టీమ్ నుండి మరొక రౌండ్ తొలగింపులను ప్రకటించింది. ఓ నివేదిక ప్రకారం.. పిచాయ్ నుంచి లీక్ అయిన ఇంటర్నెట్ మెమో దీన్ని స్పష్టంగా చూపిస్తుంది. ఇక ఇటీవలే ప్రమఖ ఐటీ సంస్థ గూగుల్ 1000 మంది ఉద్యోగులును తొలిగిస్తున్నట్లు ప్రకటించింది. గూగుల్ హార్డ్‌వేర్, సెంట్రల్ ఇంజనీరింగ్ టీమ్‌లు, గూగుల్ అసిస్టెంట్ సహా పలు విభాగాల్లోని ఉద్యోగులకు లేఆఫ్స్ మెయిల్స్ పంపినట్లు సమాచారం.