చర్చలోకి గూగుల్ సీఈఓ జీతం.. మండి పడుతున్న ఉద్యోగులు

చర్చలోకి గూగుల్ సీఈఓ జీతం.. మండి పడుతున్న ఉద్యోగులు

కాలిఫోర్నియా: గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ పారితోషికం హాట్ టాపిక్ గా మారింది. 2022 సంవత్సరానికి గానూ పిచాయ్ 226 మిలియన్ డా లర్లను అందుకున్నాడు. భారత కరె న్సీలో దీని విలువ రూ.1850 కోట్లకు పైగానే ఉంటుంది. ఈ విషయాన్ని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్ సంస్థ వెల్లడించింది.

కంపెనీ ఉద్యోగి సగటు వేతనంతో పోలిస్తే ఇది 800 రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. సుందర్ అందుకున్న పారితోషికంలో 218 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్ అవార్డ్స్ కూడా ఉన్నాయి. సంస్థలో పొదుపు చర్యల పేరిట ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో సుందర్ ఈ స్థాయి పారితోషికం తీసుకోవడం చర్చ నీయాంశమైంది.