క్రోమ్ లోగో మార్చిన గూగుల్ 

క్రోమ్ లోగో మార్చిన గూగుల్ 

ప్రముఖ సెర్చింజన్ గూగుల్ క్రోమ్ లోగోలో మార్పులు చేసింది. 2014 తర్వాత తొలిసారి లోగో ఛేంజ్ చేసింది. రీ డిజైన్ చేసిన క్రోమ్ లోగో ఫస్ట్ లుక్ను గూగుల్  క్రోమ్ డిజైనర్ ఎల్విన్ హూ ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. క్రోమ్ కొత్త ఐకాన్ గమనించారా.. 8 ఏళ్ల తర్వాత తిరిగి ఐకాన్ రీఫ్రెష్ అయిందంటూ పోస్ట్ చేశారు. 
గూగుల్ క్రోమ్ లోగోలో కేవలం స్వల్ప మార్పులు మాత్రమే చేసింది. చాలా మంది నెటిజన్లకు అసలు ఏం మార్పు చేశారో అర్థం కాలేదు. లోగోలో ఉండే రెడ్, గ్రీన్, ఎల్లో, బ్లూ కలర్స్ను కాస్త బ్రైట్గా మార్చారు. మధ్యలో ఉన్న బ్లూ కలర్ సర్కిల్ సైజు కొద్దిగా పెంచారు. విండోస్తో పాటు ఇతర ఆపరేటింగ్ సిస్టమ్స్ కోసం ఈ లోగో డిజైన్ చేసినట్లు ఎల్విన్ హూ ప్రకటించారు. త్వరలోనే కొత్త లోగో డెస్క్ టాప్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. గూగుల్ కంపెనీ 2008లో క్రోమ్ బ్రౌజర్ను అందుబాటులోకి తెచ్చిన తర్వాత 2011,2014లో లోగోలో మార్పులు చేసింది.

మరిన్ని వార్తల కోసం..

ఘనంగా సింగర్ రేవంత్ వివాహం

కేసీఆర్ జిమ్మిక్కులు ప్రజలు నమ్మరు