విడాకుల బాటలో మరో ప్రపంచ కుబేరుడు

విడాకుల బాటలో మరో ప్రపంచ కుబేరుడు

గూగుల్ కో ఫౌండర్, ప్రపంచ కుబేరులలో ఆరో స్థానంలో ఉన్న సెర్జీ బ్రిన్ తన భార్యతో విడాకుల కోసం దరఖాస్తు చేశాడు. మూడేళ్ల క్రితమే నికోలే షానహాన్ ను బ్రిన్ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. 2015 నుండి సహజీవనంలో ఉన్న వీరు 2018లో వివాహం చేసుకున్నారు. అయితే మూడేండ్లకే తమ బంధానికి స్వస్వి పలకాలని నిర్ణయించుకున్నారు. 23ఏళ్లకే అన్నే వోజోకేను వివాహం చేసుకున్న సెర్జీ 2015 లో ఆమెతో విడిపోయాడు. ఇక బ్రిన్-షాన్ దంపతుల విజ్ఞప్తి మేరకు వారి వివరాలను కోర్టు గోప్యంగా ఉంచింది. హై ప్రొఫైల్ కేసు కావడంతో పిల్లల సంరక్షణ సహా అనేక అంశాలతో ముడిపడి ఉంటుందని తెలిపింది.  

కాగా బిల్ గేట్స్, జెఫ్ బేజోస్ తర్వాత విడాకులు తీసుకుంటున్న మూడో ధనవంతుడు సెర్గీ కావడం గమనార్హం. వీడిపోయే సమయానికి గేట్స్ దంపతుల సంపద 145 బిలియన్ డాలర్లు కాగా..బేజోస్ సంపద 137 బిలియన్ డాలర్లు. ఇక 48ఏళ్ల సెర్గే బ్రిన్ సంపద 94 బిలియన్ డాలర్లు. ఇందులో ఎక్కువశాతం గూగుల్ సంస్థలో వాటాలే. 1998లో లారేపేజ్ తో కలిసి గూగుల్ ను ఏర్పాటు చేసిన సెర్గే ఆ తర్వాత ఆల్ఫాబెట్ ను ప్రారంభించారు. అయితే 2019లో ఆల్ఫాబెట్ నుంచి బయటకు వచ్చినా బోర్డు సభ్యులుగా మాత్రం కొనసాగుతూ..మెజార్టీ షేర్లను వారితోనే అట్టిపెట్టుకున్నారు.