డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చదవడానికి గూగుల్ ఏఐ టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది

డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చదవడానికి గూగుల్ ఏఐ టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది

డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ను అర్థం చేసుకోవడం కొంత కష్టమైన పనే. అయితే, ఇక మీదట ఆ కష్టం ఉండదని గూగుల్ చెబుతోంది. ఇందుకోసం కొత్త ఏఐ టెక్నాలజీని తీసుకొచ్చింది. ఇందులో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ని డిజిటలైజ్ చేయొచ్చు. అంటే గూగుల్ స్కానర్ తో మందుల చీటీని స్కాన్ చేస్తే వాటి పేర్లు, ఫార్ములా అందులో వాడిన డ్రగ్స్ అన్నీ స్క్రీన్ మీద కనిపిస్తాయి. 

సోమవారం నాడు జరిగిన ఎనిమిదవ గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్‌ వార్షిక సమావేశంలో గూగుల్ ఈ కొత్త ఫీచర్లు తీసుకొచ్చింది. ఈ ఫీచర్లు మెషిన్ లెర్నింగ్ ప్రాసెస్ తో పని చేస్తాయి. ప్రస్తుతం కొన్ని ఫోన్లకి అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్ ను ఉపయోగించి ఎలాంటి అంచనాలకు రావద్దని గూగుల్ చెబుదోంది. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్ లో ఉన్న ఈ ఫీచర్ ని ఫార్మాసిస్ట్ లతో కలిసి డెవలప్ చేస్తున్నారు.