యాప్స్​ పునరుద్ధరణకు గూగుల్​ ఓకే 

యాప్స్​ పునరుద్ధరణకు గూగుల్​ ఓకే 

న్యూఢిల్లీ: గూగుల్​ ప్లేస్టోర్​లో యాప్స్​కు​ సర్వీస్​చార్జ్​ చెల్లింపులపై ఏర్పడ్డ వివాదంపరిష్కారమయింది. తొలగించిన అన్ని యాప్‌‌‌‌‌‌‌‌లను తన ప్లే స్టోర్‌‌‌‌‌‌‌‌లో పునరుద్ధరించడానికి గూగుల్ అంగీకరించింది. గూగుల్,  స్టార్టప్​ మధ్య  చర్చలు బాగా జరిగాయని, యాప్‌‌‌‌‌‌‌‌లను లిస్టింగ్​ చేయడానికి గూగుల్​ అంగీకరించిందని కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్​ ప్రకటించారు.

మ్యాట్రిమోనీ డాట్​ కామ్,  జాబ్ సెర్చ్ యాప్ నౌకరీ వంటి చాలా యాప్స్​ను గూగుల్​తీసేసింది.  ప్రభుత్వం ఒత్తిడి కారణంగా శనివారం నుంచి కొన్ని యాప్‌‌‌‌‌‌‌‌లను పునరుద్ధరించింది. అవి 11–-25 శాతం చార్జ్​చెల్లించడానికి అంగీకరించాయి.