మన డెవలపర్లకు గడువు పెంచిన గూగుల్​​

మన డెవలపర్లకు గడువు పెంచిన గూగుల్​​

న్యూఢిల్లీ: గూగుల్​​ ప్లే బిల్లింగ్​ సిస్టమ్​తో ఇంటిగ్రేషన్​కు మన డెవలపర్లకు ఇచ్చిన గడువును గూగుల్​​ పొడిగించింది. ఈ గడువును అక్టోబర్​ 2022 దాకా పెంచింది. అంతకు ముందు మార్చి 2022ను గడువుగా ప్రకటించినప్పటికీ, రికరింగ్​ డిజిటల్​ పేమెంట్ల రూల్స్​ మార్పుతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దేశంలోని డెవలపర్లతో కలిసి పనిచేయడంతోపాటు, ముందంజ వేయడానికి గూగుల్​​ ఎప్పుడూ రెడీగానే ఉంటుందని ఆ కంపెనీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. గూగుల్​​ ప్లే స్టోర్​ బిల్లింగ్​ సిస్టమ్​పై ఇండియా డెవలపర్లు గతంలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తన బిల్లింగ్​ సిస్టమ్​ను వాడుకునే డిజిటల్​ సర్వీసులను అమ్మాలని మన డెవలపర్లకు గూగుల్​​ ఆంక్షలు పెట్టింది. ఇందుకోసం కొంత పర్సంటేజిని తమకు చెల్లించాలని నిర్దేశించింది. యాప్​ల డౌన్​లోడ్​కు డబ్బు వసూలు చేసే డెవలపర్లకు మాత్రమే తమ రూల్​ వర్తిస్తుందని, గూగుల్​​ ప్లే స్టోర్​లోని మూడు శాతం డెవలపర్లు మాత్రమే దీనికింద కవర్​ అవుతారని గూగుల్​​ చెబుతోంది. ఈ కమిషన్​ ఫీని గతంలోని 30 శాతం నుంచి ఈ ఏడాదే 15 శాతానికి గూగుల్​​ తగ్గించింది. గూగుల్​​ డెడ్​లైన్​ పొడగింపు డెవలపర్లకు కొంత రిలీఫ్​ ఇస్తుందని అలయన్స్​ ఆఫ్​ డిజిటల్​ ఇండియా ఫౌండేషన్​ (ఏడీఐఎఫ్​) తెలిపింది. కాకపోతే, గడువు పొడగింపునకు గూగుల్​​ చెబుతున్న కారణాలను తాము అంగీకరించడం లేదని స్పష్టం చేసింది. డెవలపర్ల ముందున్న ప్రధాన సమస్య 15 శాతం ఫీ చెల్లింపేనని పేర్కొంది. గూగుల్​​ మాత్రం దీనిని గుర్తించడానికి ఒప్పుకోవడం లేదని ఏడీఐఎఫ్​ విమర్శించింది. డెవలపర్లను మెప్పించలేక,  కంటి తుడుపు చర్యగా డెడ్​లైన్​ పొడగింపును గూగుల్​​ ఎంచుకుందని పేర్కొంది.