
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో దురాగతాల మధ్య అచంచలమైన ధైర్యం,మానవత్వాన్ని ప్రదర్శించిన డా. మోడ్ హెల్మీకి గూగుల్ నివాళులర్పించింది. అతని 122వ పుట్టిన రోజు సందర్భంగా గూగుల్ డూడుల్ తో సత్కరించింది. 1901లో డాక్టర్ మోడ్ హెల్మీ సుడాన్‌లోని ఖార్టూమ్‌లో జర్మన్ తల్లి, ఈజిప్షియన్ తండ్రికి జన్మించారు. డా.హెల్మీ రెండో ప్రపంచ యుద్దం వంటి చీకటి రోజుల్లో అసాధారణమైన సాహసం, కరుణను ప్రదర్శించిన తీరు మరువలేనింది.
హోలోకాస్ట్ సమయంలో డాక్టర్ హెల్మీ తన ప్రాణాలుపణంగా పెట్టి యూదు ప్రజలను రక్షించాడు. రెండవ ప్రపంచ యుద్ధం దురాగతాల మధ్య అచంచలమైన ధైర్యం, మానవత్వాన్ని ప్రదర్శించాడు. మంగళవారం అద్భుత కళాకృతి డూడుల్ ద్వారా గూగుల్ డాక్టర్ హెల్మీకి నివాళుర్పించింది. బెర్లిన్‌కు కళాకారుడు నోవా స్నిర్ రూపొందించిన Google Doodle కళాకృతి.. సమాజంయలో ఐక్యత చిహ్నంగా అతని చేతులు విస్తరించి ఉన్నట్లు కనిపిస్తోంది.
1922లో డాక్టర్ హెల్మీ వైద్యరంగంలో తన ప్రస్థానం మొదలు పెట్టాడు. వైద్య విద్య కోసం జర్మనీలో ప్రారంబించాడు. బెర్లిన్‌లోని రాబర్ట్ కోచ్ హాస్పిటల్‌లో శిక్షణ పూర్తి చేసిన తర్వాత యూరాలజీ విభాగానికి అధిపతిగా ఎదిగాడు. అయితే, 1933లో అడాల్ఫ్ హిట్లర్ అధికారంలోకి రావడంతో ఆస్పత్రి యూదు సిబ్బందిని తొలగించడంతో డాక్టర్ హెల్మీ స్వయంగా నాజీ పాలనలో వివక్ష, హింసను ఎదుర్కొన్నాడు.
చరిత్రలోని చీకటి అధ్యాయాలలో ఒకటైన జీవితాలను రక్షించిన అతని నిస్వార్థ, ధైర్యమైన చర్యలను గుర్తిస్తూ యూద్ వాషెమ్, వరల్డ్ హోలోకాస్ట్ రిమెంబరెన్స్ సెంటర్ డాక్టర్ మోడ్ హెల్మీని 2013లో రైటియస్ అమాంగ్ ది నేషన్స్ అవార్డుతో సత్కరించింది.