Google Layoffs : భారత్లో భారీగా ఉద్యోగాల కోత

Google Layoffs : భారత్లో భారీగా ఉద్యోగాల కోత

టెక్ జెయింట్ గూగుల్ భారత్లో 453  మంది ఉద్యోగుల్ని తొలగించింది. ఆర్థిక మాంద్యం భయాలు, కాస్ట్ కట్టింగ్ పేరుతో ఎంప్లాయిస్కు పింక్ స్లిప్ ఇచ్చింది. విధుల నుంచి తొలగించిన వారిలో వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు ఉన్నారు. గూగుల్ వైస్ ప్రెసిడెంట్, ఇండియా హెడ్ సంజయ్ గుప్తా గురువారం రాత్రి ఈ మెయిల్ ద్వారా వారికి సమాచారం ఇచ్చారు. సింగపూర్ పనిచేస్తున్న మరో 190 మంది ఉద్యోగులను గూగుల్ టర్మినేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 12,000 మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ జనవరి 20న ప్రకటించారు. ఇందులో భాగంగానే ఇప్పుడు భారత్ లో ఉద్యోగుల్ని తొలగించారు. గత 25ఏళ్లలో గూగుల్ ఇంత భారీ మొత్తంలో ఎంప్లాయిస్ ను తొలగించడం ఇదే తొలిసారి.12,000 మందిని తొలగించాలన్న నిర్ణయాన్ని నిరసిస్తూ  స్విట్జర్లాండ్ లోని 250 మంది గూగుల్ ఉద్యోగులు గురువారం ఆందోళనకు దిగారు. న్యూయార్క్, కాలిఫోర్నియా ఆఫీసుల్లోనూ ఉద్యోగులు ప్లకార్డులతో నిరసన చేపట్టారు.