స్కూల్ పిల్లల కోసం గూగుల్ కొత్త యాప్

స్కూల్ పిల్లల కోసం గూగుల్ కొత్త యాప్

ఫోన్ ఉంటే చాలు ఇప్పటి పిల్లలకు ఏమీ లేకున్నా ఫర్వాలేదు. దీన్ని ఆసరాగా చేసుకుని చదువునే పిల్లలు బాగుపడాలనే ఉద్దేశంతో ఓ మంచి నిర్నయం తీసుకుంది గూగుల్. పిల్లల కోసం స్టడీ యాప్ ను ప్రవేశపెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాల విద్యార్థులే లక్ష్యంగా, పిల్లల్లో స్టడీ స్కిల్స్ పెంపొందించేందుకుగానూ గూగుల్ సరికొత్త యాప్‌ ను తీసుకువచ్చింది. “బోలో” అనే యాప్ నే విడుదల చేసింది. ఈ యాప్ ద్వారా చిన్న పిల్లల్లో ఇంగ్లీష్, హిందీ స్కిల్స్ నేర్చుకోవడం ఈజీ అవుతుందని గూగుల్ చెబుతోంది.

ఈ యాప్‌ లో క్రియేట్ చేసిన యానిమేటెడ్ క్యారెక్టర్ చిన్నారి.. యాప్‌ లో పొందుపరిచిన పాఠ్యాంశాలను చదవి వినిపిస్తుందట. ఆ తరువాత యాప్ యూజర్లు చదవాల్సి ఉంటుంది. అలా చదవిన అంశాన్ని యాప్ పరిశీలిస్తుందట. అంతేకాకుండా స్టడీలో ఏవైనా తప్పులుంటే.. యాప్ మళ్లీ చదవి వినిపిస్తుందట. ఈ యాప్ గూగుల్ స్పీచ్, టెక్ట్స్ టు స్పీచ్ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది.