గూగుల్ పే వాడేవాళ్లందరికీ గుడ్ న్యూస్. మీరు ఎక్కువగా ట్రాన్ సాక్షన్స్ చేస్తున్నారా.. రివార్డ్ గా స్క్రాచ్ కార్డులు పొందుతున్నారా.. అయితే, మీ అకౌంట్లో వేల రూపాయలు వచ్చి చేరుతాయి. అయితే, అవి పర్మనెంట్ గా మీ అకౌంట్లో ఉంటాయనుకుంటే పొరపాటే. స్క్రాచ్ కార్డ్ రూపంలో ఇచ్చిన అమౌంట్ ను మళ్లీ వెనక్కి తీసుకుంటుంది గూగుల్ పే. వాళ్ల సర్వర్ లో వచ్చిన టెక్నికల్ గ్లిచ్ వల్ల ఇలా జరిగిందని ప్రకటించింది.
అమెరికాలోని కొంతమంది గూగుల్ పే యూజర్లకు ఇదే జరిగింది. యూజర్లకు స్క్రాచ్ కార్డ్ రూపంలో 10 నుంచి 1000 యూఎస్ డాలర్లను రివార్డ్ గా ఇచ్చింది (ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.80 వేలు). ఆ డబ్బంతా యూజర్ల అకౌంట్ లోకి జమచేశారు కూడా. అప్పుడే మొదలైంది అసలైన ట్విస్ట్.
‘మీ ఖాతాలో జమైన డబ్బంతా తిరిగి తీసుకుంటుంన్నాం. గూగుల్ పేలో జరిగిన టెక్నికల్ గ్లిచ్ వల్ల ఇలా జరిగింది. అంతేకానీ ఆ డబ్బు మీకు రివార్డ్ గా దక్కలేదు. దయచేసి ఇందుకు సహకరించండి’ అంటూ మెయిల్స్ పంపింది. ఈ పోస్ట్ చూసిన యూర్లు ఒక్కసారిగా అవ్వాక్కయ్యారు. అదృష్టం కొద్దీ వచ్చిందనుకున్న డబ్బు ఇలా పోయిందే అని బాధ పడ్డారు.
