మీ ఫోన్ లో గూగుల్ పే ఉందా.. అయితే ఈ యాప్స్ అస్సలు వాడొద్దు.. డిలీట్

మీ ఫోన్ లో గూగుల్ పే ఉందా.. అయితే ఈ యాప్స్ అస్సలు వాడొద్దు.. డిలీట్

దేశంలో అత్యంత ప్రజాదరణ పొంది UPI చెల్లింపు యాప్ లలో Google Pay ఒకటి. భారత్ లో మార్కెట్ వాటా పరంగా అత్యధికంగా ఉపయోగించే టాప్ 5 UPI యాప్ లలో ఈ యాప్ ఒకటి. వాస్తవానికి చెల్లింపు యాప్ కోసం Google కి అతిపెద్ద మార్కెట్లలో భారత్ ఒకటి. అనుమానాస్పద లావాదేవీల గుర్తింపు, మోసాలను నిరోధించే అత్యుత్తమమైన కేతికతను వినియోగిస్తున్నట్లు గూగుల్ చెబుతోంది. 

సురక్షితమై టెక్నాలజీ రూపొందించేందుకు మేం ఇతరుల కంటే చురుకుగా పనిచేస్తాం.. కంపెనీ తనవంతు కృషి చేస్తున్నప్పటికీ వినియోగదారులుకూడా జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యమని.. గూగుల్ వినియోగదారుల కోసం కొన్ని ముఖ్యమైన ఎప్పటికీ చేయకూడని వాటిని దాని వెబ్ సైట్ లో షేర్ చేసింది. 

వాటిలో కీలకమైనది అన్ని స్క్రీన్ షేరింగ్ యాప్ లను మూసివేయడం.. లావాదేవీలు చేస్తున్నప్పుడు స్క్రీన్ షేరింగ్ యాప్ లను ఎప్పుడూ ఉపయోగించొద్దని హెచ్చరించింది. స్క్రీన్ షేరింగ్ యాప్ లు అంటే ఇతర వ్యక్తులను మీడివైజ్ లోకి అనుమతించడం.ఫోన్, టాబ్లెట్ లేదా కంప్యూటర్ వినియోగిస్తున్నప్పుడు మీ పరికర స్క్రీన్ పై ఏముందో ముందుగా చెక్ చేసుకోవాలి. ఈ యాప్ లు వినియోగించబడినప్పుడు మీ ఫోన్ లేదా డివైజ్ ను నియంత్రిస్తాయి. ఉదాహరణకు స్క్రీన్ షేర్, Any Desk, TeamViewer.

Google pay తో స్క్రీన్ షేరింగ్ యాప్ లను ఎందుకు ఉపయోగించకూడదు అంటే.. 

  • సైబర్ మోసగాళ్లు ఈ యాప్ లను ఉపయోగించవచ్చు.. 
  • మీ తరపున లావాదేవీలు చేయడానికి మీ డివైజ్ ను కంట్రోల్ తీసుకోవచ్చు. 
  • మీ ATM లేదా డెబిట్ కార్డు వివరాలను తెలుసుకోవచ్చు. 
  • మీ ఫోన్ కు పంపిన OTP ని చూడొచ్చు. మీ ఖాతానుంచి డబ్బులు బదిలీ చేయడానికి వినియోగించవచ్చు. 

ఏ కారణం చేతనైనా థర్డ్ పార్టీ యాప్ ని డౌన్ లోడ్ చేయమని లేదా ఇన్ స్టాల్ చేయమని Google Payఎప్పుడూ అడగదని.. గూగుల్ వినియోగదారులకు స్పష్టం చేసింది. ఈ యాప్ లను డౌన్ లోడ్ చేసి ఉంటే.. Google Pay ని వినియోగించేముందు అవి క్లోజ్ చేసినట్లు నిర్దారించుకోవాలి. ఎవరైనా గూగుల్ ప్రతినిధిగా ఫోజులిచ్చి ఈ యాప్ లను డౌన్ లోడ్ చేయమని సూచిస్తూ.. వాటిని వెంటనే అన్ ఇన్స్టాల్ చేసి తొలగించండి.. వెంటనే Google Pay కి కూడా ఫిర్యాదు చేయొచ్చని కంపెనీ స్పష్టం చేసింది.