వాట్సాప్​ మెసేజ్​లు చదివే గూగుల్!

వాట్సాప్​ మెసేజ్​లు చదివే గూగుల్!

గూగుల్​ వర్చువల్​ అసిస్టెంట్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో ముందుకొస్తుంది. ఇప్పటివరకు ఫోన్​ ఇన్​బాక్స్​లోని మెసేజ్​లను మాత్రమే చదివి వినిపించే గూగుల్​ అసిస్టెంట్​ ఇకపై ‘వాట్సాప్, టెలిగ్రామ్, స్లాక్’ వంటి థర్డ్​పార్టీ యాప్​లకు సంబంధించిన మెసేజ్​లను కూడా చదివి వినిపిస్తుంది. ఇంతకుముందు ఈ ఫీచర్​ గూగుల్​ యాప్స్​కు మాత్రమే పరిమితం. త్వరలో అందుబాటులోకి రానున్న అప్​డేట్​తో ఈ ఫీచర్​ను యూజర్లు వాడుకోవచ్చు. ప్రస్తుతం మెసేజ్​లు చదివే ఫీచర్ ఇంగ్లీష్​కే పరిమితం.

ఇతర భాషల్లో అవకాశం లేదు. వాట్సాప్, టెలిగ్రామ్​ వంటి యాప్​లలో టెక్స్ట్​ మెసేజ్​లు మాత్రమే చదువుతుంది. ఒకవేళ మెసేజ్​లలో ఫొటోలు, వీడియోలు ఉంటే ‘ద మెసేజ్​ జస్ట్​ కంటైన్స్​ఎన్ ఆడియో/వీడియో అటాచ్​మెంట్’ అని చదివి వినిపిస్తుంది. ఈ ఫీచర్​ డ్రైవింగ్​లో ఉండి మొబైల్​ వాడలేనప్పుడు, వంట చేస్తున్నప్పుడు, ఏదైనా పని చేస్తూ బిజీగా ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది. అయితే మెసేజ్​లను బయటికి గట్టిగా చదివి వినిపించినా పర్లేదనుకునేవాళ్లు ఈ ఆప్షన్​ సెలెక్ట్​ చేసుకోవచ్చు.