ప్లే స్టోర్‌‌‌‌కి తిరిగొచ్చిన నౌకరి

ప్లే స్టోర్‌‌‌‌కి తిరిగొచ్చిన నౌకరి

న్యూఢిల్లీ: ప్లే స్టోర్ నుంచి తొలగించిన యాప్‌‌‌‌లలో కొన్నింటిని తిరిగి యాప్‌‌‌‌ స్టోర్‌‌‌‌‌‌‌‌లో గూగుల్‌‌‌‌ చేర్చుకుంది. సర్వీస్ ఫీజు చెల్లించనందుకు 12 కి పైగా యాప్‌‌‌‌లను ప్లే స్టోర్ నుంచి ఈ టెక్ కంపెనీ శుక్రవారం  తొలగించింది.  వీటిలో కొన్నింటికి మరికొంత కాలం పాటు టైమ్ ఇవ్వాలని నిర్ణయించుకుంది.  ఇన్ఫో ఎడ్జ్‌‌‌‌కు చెందిన  షాదీ డాట్ కామ్‌‌‌‌, నౌకరి, నౌకరీ రిక్రూటర్‌‌‌‌‌‌‌‌, నౌకరీగల్ఫ్‌‌‌‌ జాబ్ సెర్చ్‌‌‌‌, 99 ఎకర్స్‌‌‌‌, శిక్ష యాప్‌‌‌‌లు గూగుల్ ప్లే స్టోర్‌‌‌‌‌‌‌‌లో తిరిగి అందుబాటులోకి వచ్చాయి.  ‘ఇన్ఫోఎడ్జ్‌‌‌‌ యాప్స్‌‌‌‌ ప్లే స్టోర్‌‌‌‌‌‌‌‌కు తిరిగొచ్చాయి. కంపెనీ సీఈఓ హితేష్‌‌‌‌, ఇన్ఫోఎడ్జ్‌‌‌‌ టీమ్‌‌‌‌ చర్యలు ఫలితాన్నిచ్చాయి. దీని కోసం వీరు రాత్రంతా నిద్రలేకుండా పనిచేశారు. 

సంక్షోభాన్ని గొప్పగా మేనేజ్ చేశారు’ అని  ఇన్ఫో ఎడ్జ్‌‌‌‌ ఫౌండర్‌‌‌‌‌‌‌‌ సంజీవ్‌‌‌‌ బిక  ఎక్స్‌‌‌‌లో  పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్‌‌‌‌ ఈ నెల 4 న గూగుల్ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతోనే గూగుల్ దిగొచ్చిందని తెలుస్తోంది.   ఆల్ట్‌‌‌‌, స్టేజ్‌‌‌‌, ఆహా,  ట్రూలీ మాడ్లీ, క్వాక్‌‌‌‌ క్వాక్‌‌‌‌, ఆడియో కంటెంట్ యాప్‌‌‌‌ కుకు ఎఫ్‌‌‌‌ఎం,  సోషల్ నెట్‌‌‌‌వర్కింగ్ యాప్ ఫ్రెండ్‌‌‌‌  తొలగించిన యాప్‌‌‌‌లలో ఉన్నాయి.