గూగుల్‌ నుంచి బనానా ప్రో వచ్చేసింది.. ఒక ఇమేజ్‌ జనరేట్‌ చేయడానికి 14 రిఫరెన్స్ ఫొటోలను ఇవ్వొచ్చు !

గూగుల్‌ నుంచి బనానా ప్రో వచ్చేసింది.. ఒక ఇమేజ్‌ జనరేట్‌ చేయడానికి 14 రిఫరెన్స్ ఫొటోలను ఇవ్వొచ్చు !

గూగుల్‌ తీసుకొచ్చిన నానో బనానా గతంలో ఒక ట్రెండ్‌ క్రియేట్‌ చేసింది. అయితే.. దానికి ఇప్పుడు మరిన్ని కొత్త ఫీచర్లు జోడించి ‘నానో బనానా ప్రో’ని తీసుకొచ్చింది గూగుల్‌‌‌. ఇది లేటెస్ట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ జెమిని 3 ప్రో ద్వారా పనిచేస్తుంది. జెమిని యాప్, గూగుల్ ఏఐ స్టూడియోలో అందుబాటులో ఉంది. ఈ అప్‌‌‌‌‌‌‌‌గ్రేడ్‌తో ఇమేజ్‌లో ఏ భాగాన్నైనా సెలక్ట్ చేసి రిఫైన్ చేయొచ్చు. కెమెరా యాంగిల్స్, లైటింగ్ మార్చడం, ఫోకస్ అడ్జస్ట్ చేయడం, కలర్ గ్రేడింగ్ లాంటి అడ్వాన్స్డ్ ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. 2K, 4K ఇమేజ్ రిజల్యూషన్స్‌కు కూడా సపోర్ట్‌ చేస్తుంది.

ఒక ఇమేజ్‌జనరేట్‌ చేయడానికి దీనికి ఇప్పుడు 14 రిఫరెన్స్ ఫొటోలను ఇవ్వొచ్చు. వాటన్నింటిని బ్లెండ్‌ చేసి కొత్త ఇమేజ్‌ని ఇస్తుంది. దీన్ని గూగుల్ సెర్చ్‌కు అనుసంధానించారు. దీనివల్ల నానో బనానా ప్రో రియల్‌‌‌‌‌‌‌‌ డేటా ఆధారంగా పనిచేస్తుంది. విజువల్స్, ఇన్ఫోగ్రాఫిక్స్, ఫ్లాష్ కార్డ్‌లు లాంటి వాటిని రూపొందించడానికి రియల్-టైమ్ వెబ్ డేటాను ఉపయోగించుకుంటుంది.

ఉదాహరణకు.. ‘‘ఇలాచీ చాయ్‌ని ఎలా తయారు చేయాలో చూపించే ఇన్ఫోగ్రాఫిక్‌ని క్రియేట్ చెయ్‌” అని ప్రాంప్ట్ ఇస్తే.. అది గూగుల్ సెర్చ్‌ చేసి, ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇలాచీ చాయ్‌ ఎలా తయారు చేయాలో తెలుసుకుని ఈజీగా అర్థమయ్యేలా ఒక ఇమేజ్‌ని జనరేట్ చేసి ఇస్తుంది. ఫొటోల్లోని టెక్స్ట్ చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ఇది చాలా భాషలకు సపోర్ట్ చేస్తుంది. స్పెల్లింగ్‌ మిస్టేక్స్‌‌‌‌ని కరెక్ట్ చేస్తుంది. ఒకే ప్రాంప్ట్‌తో ఎడ్యుకేషనల్ ఇన్ఫోగ్రాఫిక్స్, డయాగ్రామ్‌‌‌లు, స్లైడ్ డెక్‌లు, కామిక్ బుక్‌లు, ప్రొడక్ట్ మాకప్‌లు క్రియేట్‌ చేయొచ్చు.