
అమ్రిష్ పురి. డైలాగ్స్ చెప్పడంలో ఆయనదో ప్రత్యేకమైన డిక్షన్. గంభీరమైన ఆహార్యం. బాలీవుడ్ లో ఎంతమంది విలన్స్ వచ్చినా.. ఆయన .. విలన్ అనే రోల్ కే ఓ ఐకన్. హిందీలోనే కాదు.. హాలీవుడ్ మూవీస్ లో నటించి.. ఇండియన్ సినిమా యాక్టింగ్ టాలెంట్ ను ఆయన ప్రపంచానికి చాటారు. తెలుగు సహా దక్షిణాది భాషల్లో ఆయన తన ప్రతిభ చాటుకున్నారు.
1932 జూన్ 22న ఆయన పంజాబ్ లోని నవాన్ షహర్ లో పుట్టారు అమ్రిష్ పురి. 1967 నుంచి 2005 వరకు ఆయన 400పైగా సినిమాల్లో నటించారు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ముంబైకి వచ్చి.. అవకాశాలు వెతుక్కున్నారు అమ్రిష్ పురి. ఎంతో మంది విలన్లు ఉన్నా.. వారందరిలో తాను డిఫరెంట్ అని ప్రూవ్ చేసుకున్నారు. ఆయన వాయిస్సే ఆయనకు ప్లస్ పాయింట్. అమ్రిష్ పురి విలన్ గా చేసిన మ్యాగ్జిమమ్ సినిమాలు సూపర్ హిట్. 3 ఫిలింఫేర్ బెస్ట్ సపోర్టింగ్ అవార్డ్ లు గెల్చుకున్నారు. స్టీవెన్ స్పీల్ బర్గ్ తీసిన హాలీవుడ్ సినిమా ఇండియానా జోన్స్ అండ్ ద టెంపుల్ ఆఫ్ డూమ్ లో వెస్ట్రన్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకున్నారు అమ్రిష్ పురి.
అమ్రిష్ పురి ఘనతను గుర్తిస్తూ.. ఆయన 87వ జయంతి సందర్భంగా గూగుల్ సంస్థ.. ప్రత్యేకమైన డూడుల్ తో ఆయనకు నివాళులు అర్పించింది.
ఇండియన్ సినిమాలో అమ్రిష్ పురి చేసిన టాప్ క్యారెక్టర్లు ఇవే అంటుంటారు అభిమానులు.
మొగాంబో – మిస్టర్ ఇండియా
మహాద్రష్ట – జగదేక వీరుడు అతిలోక సుందరి
రాజా వర్మ- ఆదిత్య 369
ఇంద్రజిత్ చద్దా – దామిని
ఠాకూర్ దుర్జన్ సింగ్ – కరణ్ అర్జున్
బల్వంత్ రాయ్ – ఘాయల్
బిషంబార్ నాథ్ – రామ్ లఖన్
భైరో నాథ్ – నాగిన
మోలా రామ్ – ఇండియానా జోన్స్ అండ్ ద టెంపుల్ ఆఫ్ డూమ్
అష్రఫ్ ఆలీ – గదర్ ఏక్ ప్రేమ్ కథ
జనరల్ డోంగ్ – తహల్కా
జీడీ థక్రాల్ – మేరీ జంగ్