
టెన్నిస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసే ప్రతిష్టాత్మక వింబుల్డన్ సోమవారం (జూన్ 30) నుంచి ప్రారంభం కానుంది. టోర్నీ అధికారులు ఈ టోర్నీ డ్రా శుక్రవారం (జూన్ 28) విడుదల చేశారు. టాప్ సీడ్ జానిక్ సిన్నర్ తొలి వింబుల్డన్ టైటిల్ సాధించాలని ఆరాటపడుతున్నాడు. అయితే అతని డ్రా లోనే జొకోవిచ్ కూడా ఉన్నాడు. ఏడు సార్లు వింబుల్డన్ గెలిచిన జొకోవిచ్.. రికార్డ్ స్థాయిలో ఎనిమిదో సారి ఈ టైటిల్ అందుకొని అత్యధిక వింబుల్డన్ టైటిల్ గెలిచిన ఫెదరర్ రికార్డ్ సమం చేయాలని భావిస్తున్నాడు. ఇక అందరి దృష్టి యువ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ పైనే ఉంది.
గత మూడేళ్ళుగా టెన్నిస్ లో సంచలన విజయాలు సాధిస్తున్న ఈ స్పెయిన్ వీరుడు హ్యాట్రిక్ వింబుల్డన్ టైటిల్స్ పై కన్నేశాడు. 2023 లో ఐదు సెట్ల పోరాటంలో జొకోవిచ్ కు బిగ్ షాక్ ఇచ్చిన అల్కరాజ్.. 2024 లో జొకోవిచ్ ను వరుస సెట్లలో చిత్తుగా ఓడించాడు. 2025 లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న ఈ యువ స్పెయిన్ సంచలనం రెండో సీడ్ గా బరిలోకి దిగుతున్నాడు. అంచనాలకు తగ్గట్టు ఆడితే అల్కరాజ్ వింబుల్డన్ ఫైనల్ కు చేరుకునే అవకాశం ఉంది. అయితే తొలి రౌండ్ లోనే అలంకారాజ్ కు కఠిన పరీక్ష ఎదురు కానుంది.
రెండుసార్లు డిఫెండింగ్ ఛాంపియన్ అయిన కార్లోస్.. 38 ఏళ్ల ఫాబియో ఫోగ్నినితో తొలి రౌండ్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. క్వార్టర్ ఫైనల్స్‌లో ఎనిమిదో సీడ్ హోల్గర్ రూన్‌తో తలపడే అవకాశం ఉంది. నంబర్ 1 ఆటగాడు సిన్నర్ తొలి రౌండ్ లో లూకా నార్డితో తలపడతాడు. జాక్ డ్రేపర్‌తో క్వార్టర్-ఫైనల్ ఆడే అవకాశం ఉంది. జొకోవిచ్ ఫ్రెంచ్ ఆటగాడు అలెగ్జాండర్ ముల్లర్‌తో తన ప్రచారాన్ని ప్రారంభిస్తాడు. మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ తన తొలి రౌండ్ లో ఆర్థర్ రిండర్‌క్నెచ్‌తో తలపడతాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో టేలర్ ఫ్రిట్జ్‌తో తలపడే అవకాశం ఉంది.
Carlos Alcaraz Wimbledon 2025 draw:
— Zain (@ItzzZain10) June 27, 2025
1R: Fognini
2R: Tarvet/Riedi
3R: FAA/Struff
4R: Rublev/Tsitsipas
QF: Rune/Tiafoe/Lehecka
SF: Zverat/Fritz/Medvedev
F: Sinner/Djokovic
Three peat on the line. pic.twitter.com/fB99vjhMV1