అజిత్ మోహన్, రాజు శివరాత్రి, క్యాంప్ శశి, సాయి కుమార్, పవోన్ రమేష్, మోనిక బుసం ప్రధాన పాత్రల్లో రోహిత్, శశి రూపొందించిన చిత్రం ‘గోపి గాళ్ల గోవా ట్రిప్’. సాయి కుమార్, సీతా రామరాజు, రమణా రెడ్డి నిర్మించారు. నవంబర్ 14న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకులు రోహిత్, శశి మాట్లాడుతూ ‘గద్వాల్ జిల్లాలోని ఒక రిమోట్ విలేజ్‌లో షూట్ చేశాం. ఇది ఒక రకమైన రూట్ ఫిలిం.
హైవే మీద ట్రావెల్ చేస్తూ గోవా వెళ్లే కుర్రాళ్ల కథ. ఇదొక చిల్డ్ బీర్ లాంటి మూవీ. అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాం’ అని చెప్పారు. ఇండిపెండెంట్ ఫిలిమ్స్‌లో ఇది మాగ్నమోపస్ లాంటిది అంటూ నటీనటులు అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ రవి నిడిమర్తి తదితరులు పాల్గొన్నారు.
